మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కు ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా పేరు ఉంది.ఈ క్రేజ్ తోనే నెక్స్ట్ తన లైనప్ ను సెట్ చేసుకుంటున్నాడు.
ట్రిపుల్ ఆర్ సినిమాతో సంచలన విజయం అందుకుని గ్లోబల్ వైడ్ గా మార్కెట్ సొంతం చేసుకున్న చరణ్ నెక్స్ట్ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.ఇక ప్రస్తుతం ఈయన తన 15వ సినిమాను అగ్ర డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో చేస్తున్నాడు.
ఇక ప్రజెంట్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ”గేమ్ ఛేంజర్” (Game Changer) ఒకటి.రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా టైటిల్ ను ప్రకటించారు.ఈ టైటిల్ పై మెగా ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో గ్రామీణ యువకుడిగా ఒక పాత్ర అయితే అల్ట్రా స్టైలిష్ లుక్ లో మరో పాత్ర అని తెలుస్తుంది.
ఇటీవలే స్టైలిష్ లుక్ ను వదిలారు.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ (Action Sequences) ను డైరెక్టర్ అద్భుతంగా ప్లాన్ చేశారట.ఈ సీక్వెన్స్ లో స్వాతంత్ర్య యోధుల గొప్పదనాన్ని చాటి చెప్పే విధంగా ఉంటుందట.
అంతేకాదు గూస్ బంప్స్ తెప్పించే ఈ సీక్వెన్స్ ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందని టాక్.మొత్తానికి ఈ క్రేజీ సీక్వెన్స్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
చూడాలి ఈ సినిమాతో ట్రిపుల్ ఆర్ విజయాన్ని కంటిన్యూ చేస్తాడో లేదో.