రామ్ చరణ్... టాలీవుడ్ హీరోలకు భిన్నంగా ఈ మెగా హీరో ప్రయాణం

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అనేక మంది హీరోల్లో రామ్ చరణ్( Ram charan ) ప్రస్తుతం టాప్ యాక్టర్ గా కొనసాగుతున్నాడు.

మిగతా హీరోలతో పోలిస్తే కూడా రామ్ చరణ్ చాలా భిన్నమైన వైఖరి కలిగి ఉంటాడు అనేక విషయాల్లో మిగతా వారికి తనకు తారతమ్యాలు కనిపిస్తాయి.

రామ్ చరణ్ చేసే పనుల్లో లేదా తీసే సినిమాల్లో తానే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాడా లేదా అతని తండ్రి సలహాలు ఇస్తుంటాడా అనే విషయంలో క్లారిటీ లేదు కానీ రాంచరణ్ ఈ మధ్య కాలంలో ఏం చేసినా కూడా చాలా కొత్తగా చేస్తున్నాడు అనేది ప్రతి ఒక్కరూ టాలీవుడ్ సర్కిల్ లో మాట్లాడుకుంటున్నారు.మిగతా వారికి భిన్నంగా రామ్ చరణ్ మారడానికి గల కారణాలేంటి, అతను తీసుకున్న నిర్ణయాలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

రామ్ చరణ్ ఇటీవల g20 సదస్సుకు( G20 Summit ) హాజరయ్యాడు అయితే ఇది సినిమాయేతర ప్రోగ్రామ్ అనే విషయం మన అందరికీ తెలిసిందే అతడు ఈ ప్రోగ్రాం లో చాలా మంది ప్రముఖులతో క్లోజ్ గా మాట్లాడుతు కనిపించాడు.తెలుగు సినిమాల్లో ఏ హీరో కూడా ఇలా సినిమాయేతర ప్రోగ్రాం లో ఇంతలా పాల్గొన్నది ముందు ఎప్పుడూ లేదు.మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే పెళ్లై దశాబ్ద కాలం దాటిన పిల్లల విషయంలో రామ్ చరణ్ తొందరగా పడలేదు ఆచితూచి అడుగులు వేశాడు ఆర్ఆర్ వంటి సినిమాలో నటించి ఆస్కార్ స్థాయికి ఎదిగిన తర్వాతే పిల్లలను కనాలని నిర్ణయించుకున్నాడో ఏమో తెలియదు కానీ ప్రస్తుతం ఉపాసన గర్భవతిగా( Upasana as pregnant ) ఉంది.

రామ్ చరణ్ తండ్రి నటిస్తున్న సినిమాలకు తానే నిర్మాతగా మారాడు.అంతేకాదు ఫ్రెండ్ విక్రమ్ కుమార్( Vikram kumar reddy ) తో వి-మెగా క్రియేషన్స్( V Mega Creations ) అనే ఒక సంస్థను కూడా ప్రారంభించాడు ఈ సంస్థ ద్వారా సినిమా ప్రపంచ స్థాయిలో ఎదుగుతున్న విధానం అలాగే కొత్తవారిని తెరపైకి తెచ్చే అనేక విషయాల్లో సహాయం చేస్తారని తెలుస్తోంది ఇప్పటికి ఈ సంస్థ యొక్క ఎజెండా క్లారిటీ లేకపోయినా కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలని ఉద్దేశంతో మొదలు పెట్టినట్టుగా తెలుస్తుంది.ఇప్పటికే విక్రమ్ యూవీ సంస్థ ద్వారా కొన్ని సినిమాలు నిర్మించిన సంగతి మనకు తెలిసిందే.

Advertisement
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

తాజా వార్తలు