టాలీవుడ్ హీరో పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనలు జూన్ 14,2012 లో మూడుముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే.జూన్ 14 నాటికి వీరి పెళ్లి జరిగింది దాదాపుగా పదేళ్లు కావస్తోంది.
ఈ క్రమంలోనే వారి పదవ యానివర్సి డే ఘనంగా జరుపుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ జంట పదో వార్షికోత్సవ వేడుకలు ఇటలీలో జరగబోతున్నట్లు తెలుస్తోంది.
అందుకు అనుగుణంగానే వీరు ఏర్పాట్లను కూడా పూర్తి చేసినట్లు సమాచారం.ఇటలీ దేశంలో ప్రఖ్యాత నగరాల్లో ఒకటైన మిలాన్ నగరంలో ఆధారంగా గడపబోతున్నారు.
ఇకపోతే వీరిద్దరిదీ ప్రేమ వివాహం అయిన విషయం తెలిసిందే.ప్రేమించుకొని ఇరు కుటుంబాల అంగీకారంతో పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.ఇటు మెగా ఫ్యామిలీ అటు దోమకొండ సంస్థానానికి చెందిన వారు రెండు పెద్ద కుటుంబాలు కలవడంతో రామ్ చరణ్ ఉపాసనల వివాహం ఘనంగా జరిగింది.పెళ్లి తర్వాత కూడా వీరు ఎవరు పనుల్లో వాళ్ళు బిజీగానే ఉన్నారు.
అపోలో హాస్పిటల్స్ చైర్ పర్సన్ గా ఉపాసన బాధ్యతలు నిర్వహిస్తుండగా, హీరో రామ్ చరణ్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.
ప్రొఫెషనల్ గా పర్సనల్ గా ఉపాసన, చరణ్ లు సక్సెస్ ఫుల్ జర్నీ సాగిస్తున్నారు.
అయితే సమాజం దృష్టిలో మాత్రం వీరికో లోటు ఉంది.అన్ని బాగున్నా వీరికి సంతానం లేకపోవడం అనేది పెద్ద లోటుగా చెప్పవచ్చు.
పెళ్ళై పదేళ్లు అవుతున్నా ఉపాసన, చరణ్ లకు పిల్లలు కనలేదు.ఎంత బిజీ లైఫ్ అయినప్పటికీ ఇంత గ్యాప్ అంటే, ఎవరూ అంగీకరించరు.అలాగే వయసులో పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.ఈ విషయం మనకంటే ఉపాసన, చరణ్ లకు ఇంకా బాగా తెలుసు.అయినప్పటికీ కారణం ఏమిటో వీరిద్దరూ పిల్లల కోసం ప్లానింగ్ చేయడం లేదు.ఏడాది వ్యవధిలో రామ్ చరణ్ అల్లు అర్జున్ వివాహం చేసుకున్నారు.2011లో అల్లు అర్జున్ స్నేహారెడ్డి పెళ్లి చేసుకోగా వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.అయాన్ కి ఏడేళ్లకు ఉంటాయి, అమ్మాయి అర్హకు నాలుగైదేళ్ళ ఉన్నాయి.
అయితే రామ్ చరణ్ ఉపాసనల వారసత్వం కోసం మెగా అభిమానులతో పాటు మెగా ఫ్యామిలీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.