రామ్ చరణ్( Ram Charan ) అభిమానులు గందరగోళం లో ఉన్నారు.ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఓ రేంజ్ సినిమా శంకర్( Shankar ) దర్శకత్వం లో దక్కిందనే అభిప్రాయం వ్యక్తం అయింది.
ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా గేమ్ ఛేంజర్ సినిమా ఉంటుందని ఆశ పడ్డ రామ్ చరణ్ అభిమానులకు నిరాశే మిగిలింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.రామ్ చరణ్ గతం లో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను దక్కించుకున్నాడు.
భారీ వసూళ్లు దక్కించుకున్న ఆర్ఆర్‌ఆర్ సినిమా తర్వాత చరణ్ చేస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా( game changer movie ) ఖచ్చితంగా వెయ్యి కోట్ల మూవీ అంటూ చాలా మంది నమ్మకంతో ఉన్నారు.కానీ ఇప్పటి వరకు సినిమా విడుదల విషయం లో క్లారిటీ ఇవ్వడం లేదు.
మొదట 2023 సంక్రాంతికి అన్నారు.
ఆ తర్వాత నుండి వరుస వాయిదాలు వేస్తూనే ఉన్నారు.ఇప్పుడు 2024 సమ్మర్ లో కూడా విడుదల అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.హీరోగా రామ్ చరణ్ జోరు కు అంతా కూడా బేజారు అవ్వాల్సిందే అనుకున్న సమయం లో అసలు శంకర్ సినిమా విడుదల తేదీ విషయం లో క్లారిటీ ఇవ్వడం లేదు.
ఇప్పటి వరకు అసలు గేమ్ ఛేంజర్ సినిమా ఎంత వరకు వచ్చింది అనేది క్లారిటీ ఇవ్వక పోవడంతో దర్శకుడు శంకర్ పై చరణ్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియా లో గేమ్ ఛేంజర్ గురించి పదే పదే వార్తలు వస్తున్నా కూడా విడుదల విషయం లో క్లారిటీ లేదు.
వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇదే సమయంలో బుచ్చిబాబు ( Buchi Babu )దర్శకత్వం లో కూడా చరణ్ సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటన వచ్చింది.
కనుక చరణ్ ఫ్యాన్స్ ఈ రెండు సినిమా ల కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు.