మెగా అభిమానులు చిరంజీవి మరియు రామ్ చరణ్ కలిసి నటిస్తే చూడాలని ఆశపడ్డారు.ఆ ఆశ ఆచార్య సినిమా తో తీరింది.
రామ్ చరణ్ గెస్ట్ పాత్ర కంటే కాస్త ఎక్కువ నిడివి ఉన్న పాత్ర లో కనిపించాడు.ఇద్దరి కాంబినేషన్ సన్నివేశాలు వచ్చినప్పుడు అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేశారు.

కానీ ఆచార్య సినిమా డిజాస్టర్ అవ్వడం తో మళ్లీ మెగా అభిమానులు ఇద్దరు కాంబినేషన్ లో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.ఎప్పుడెప్పుడు ఇద్దరి కాంబినేషన్ లో మళ్లీ సినిమా వస్తుందా అంటూ చర్చలు మొదలు పెట్టారు.మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ కాంబినేషన్ లో ఒక హిట్ సినిమా కావాల్సిందే అంటూ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.అది ఎప్పటికీ నెరవేరుతుంది అనేది ఇప్పట్లో చెప్పే పరిస్థితి లేదు.
ఎందుకంటే ప్రస్తుతం ఇద్దరు కూడా వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు.ఇద్దరికీ నచ్చి వెంటనే చేయాలి అనిపించేంత అద్భుతమైన కథ ను దర్శక రచయితలు రెడీ చేస్తే అప్పుడు చిరంజీవి, రామ్ చరణ్ ముందుకు వచ్చే అవకాశం ఉంది.
అంటే మరో మూడు నాలుగు సంవత్సరాలు వెయిట్ చేయాలన్నమాట.ఆ తర్వాత అయినా వస్తుందా అంటే అనుమానమే.

మొత్తానికి చిరంజీవి మరియు రామ్ చరణ్ కాంబినేషన్ సినిమా కేవలం టాలీవుడ్ దర్శక రచయిత ల పైనే ఆధారపడి ఉంది.ఒకవేళ ఇతర భాషల దర్శక నిర్మాతలు మంచి కథ తో వచ్చినా కూడా కచ్చితంగా రామ్ చరణ్ మరియు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.మరి అద్భుతమైన కథ ను ఎవరు తీసుకొస్తారు.మళ్ళీ రామ్ చరణ్ మరియు చిరంజీవి ని కలిపి వెండి తెర పై ఎవరు చూపిస్తారు అనేది తెలియాలి అంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.







