ఇస్మార్ట్ శంకర్ తో హీరోగా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న రామ్ ఆ వెంటనే రెడ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో కాస్త ఎక్కువ సమయం తీసుకుని ఒక మంచి సబ్జెట్ అంటూ ది వారియర్ సినిమా ను చేసేందుకు కమిట్ అయ్యాడు.తమిళ దర్శకుడు లింగు స్వామి దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా ను వచ్చే నెలలో విడుదల చేయబోతున్నారు.
ఇక ఈ సినిమా ను ఏకంగా 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించారనే వార్తలు వస్తున్నాయి.సినిమా అంత బడ్జెట్ రికవరీ చేయాలంటే కనీసం 15 కోట్ల వరకు నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా రాబట్టాల్సి ఉంటుంది.
అంతే కాకుండా మరో వైపు 25 కోట్ల వరకు థియేట్రికల్ రైట్స్ ద్వారా నిర్మాతకు ఆదాయాన్ని తెచ్చి పెట్టాల్సి ఉంటుంది.అప్పుడే సినిమా ను నిర్మించిన నిర్మాతకు సేఫ్ అవుతుంది.
సినిమా విడుదలకు ముందే ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే పర్వాలేదు.సినిమా విడుదల తర్వాత లాభాలను బట్టి బిజినెస్ చేద్దాం అనుకుంటే అప్పుడు కాస్త ఫలితం అటు ఇటు అయినా కూడా ముప్పై కోట్లకు పైగా నిర్మాతకు డ్యామేజీ తప్పదు అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ది వారియర్ సినిమా పై పెద్దగా బజ్ అయితే ఇప్పటి వరకు క్రియేట్ అవ్వలేదు.ఒక్క బుల్లెట్ బండి పాటతో సినిమా కు మంచి టాక్ అయితే వచ్చింది కాని ఆ టాక్ ఎంత వరకు వసూళ్లు గా మారుతుంది అనే విషయంలో స్పష్టత లేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రామ్ సినిమా లు పాతిక కోట్ల వరకు బడ్జెట్ తో రూపొందితే పర్వాలేదు.కాని కాస్త అతి అయితే ఖచ్చితంగా రిస్క్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ టాక్ వినిపిస్తుంది.
అసలు విషయం ఏంటీ అనేది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.