జూనియర్ ఎన్టీఆర్ పుట్టుకపోతే నటుడు.. వైరల్ అవుతున్న రకుల్ క్రేజీ కామెంట్స్!

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్( Rakul Preet Singh ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తక్కువ సమయంలోనే ఈమె టాలీవుడ్ లో టాప్ హీరోల సరసన నటించింది.

కానీ ఆ తర్వాత రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అవడంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు కరువయ్యాయి.రకుల్ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అయ్యిందని చెప్పాలి.

ప్రస్తుతం ఈమె చేతిలో చిన్నా చితకా ప్రాజెక్ట్‌ లు మినహా పెద్ద సినిమాలు ఏమీ లేవు.అది కూడా బాలీవుడ్ సినిమాలు కావడం విశేషం.

సినిమా అవకాశాలు తగ్గినప్పటికీ మీకు సోషల్ మీడియా( Social media )లో ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గడం లేదు.

Advertisement

సినిమాలలో నటించకపోయినప్పటికీ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు చేరువగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.ఇది ఇలా ఉంటే ఇటీవలే ఒక చిట్ చాట్ లో టాలీవుడ్ స్టార్ హీరోల గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.ఈ మేరకు అల్లు అర్జున్( Allu Arjun ) గురించి ఆమె మాట్లాడుతూ.

అల్లు అర్జున్‌ మంచి నటుడు.నేను ఆయనతో సరైనోడు సినిమా( Sarrainodu ) చేస్తున్న సమయంలో ఒక మాట అన్నాడు.

తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లాలి అనేది తన డ్రీమ్‌ గా చెప్పుకొచ్చాడు.పుష్ప సినిమా తో నిజంగానే సినిమాను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి అల్లు అర్జున్ తీసుకు వెళ్లాడు అని చెప్పుకొచ్చింది.

అనంతరం ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.పుట్టుకతోనే నటుడు.ఒక గొప్ప వ్యక్తి.

లిక్కర్ షాప్ నుంచి 12 లక్షలు కొట్టేసిన వ్యక్తి.. వీడియో వైరల్..
ఈమెకి డ్రాకులా లాగా ఆ డిసీజ్ ఉందంట.. వెల్లుల్లి తింటే..?

బ్లడ్ లోనే అతడికి నటన ఉంది అంటూ రకుల్‌ ఆకాశానికి ఎత్తేసింది.ఇక రామ్‌ చరణ్ గొప్ప డాన్సర్ అంటూ చెప్పుకొచ్చిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ ముగ్గురితో నటించడం గౌరవంగా చెప్పుకొచ్చింది.

Advertisement

నీ మేరకు ఆమె చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ముగ్గురి హీరోల అభిమానులు రకుల్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ప్రస్తుతం ఎక్కువగా బాలీవుడ్ సినిమాలలో నటిస్తున్న రకుల్ తెలుగులో అవకాశాలు వస్తే నటించడానికి తన సిద్ధంగా ఉన్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.

తాజా వార్తలు