పింక్ డ్రెస్‎లో స్టన్నింగ్ లుక్‎తో అదరగొడుతున్న రకుల్

Rakul Preet Singh: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పింక్ డ్రెస్ లో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోంది.అభిమానులకు సోషల్ మీడియాలో ఎప్పుడూ టచ్ లో ఉండే ఈ భామ గ్లామర్ ఫొటోలతో అలరిస్తోంది.

 Rakul Looks Stunning In A Pink Dress Details, Rakul , Rakul Preet Singh Pink Dr-TeluguStop.com

అదిరిపోయే అవుట్ ఫిట్స్‎లలో షూట్లు చేస్తూ ఫ్యాన్స్‎తో పాటు నెటిజన్లనూ సైతం ఆకట్టుకుంటోంది.మత్తు చూపులు, మతిపోయే పోజులతో మంత్ర ముగ్ధులను చేసింది.

తెలుగు పరిశ్రమలో కెరటం సినిమాతో అడుగుపెట్టింది రకుల్ ప్రీత్ సింగ్. అతి తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్ ను సాధించింది.నేటితరం అగ్రహీరోలందరితో జతకట్టిన ఈ ముద్దుగుమ్మ మంచి ప్రేక్షకాదరణ పొందింది.వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, కరెంట్ తీగ, సరైనోడు, ధృవ, జయజానకి నాయక, బ్రూస్ లీ వంటి పలు సినిమాల్లో నటించింది.

ఇప్పటికే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించిన రకుల్ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల్లో రకుల్ ఫొటోలు నెటిజన్ల హృదయాలను హత్తుకుంటోంది.ఎప్పుడూ తన గ్లామర్ తో మెస్మరైజ్ చేస్తూ యువ హృదయాల్లో నిలిచిపోతోంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని పిక్స్ వైరల్ గా మారాయి.పింక్ కలర్ డ్రెస్ లో మెరిసిపోతున్న రకుల్ ను చూసిన నెటిజన్లు వావ్ అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube