బాహుబలి, బాహుబలి 2 సినిమాల విజయాల వల్ల స్టార్ హీరో ప్రభాస్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది.ఆ సినిమా విజయాల వల్ల ప్రభాస్ ప్రస్తుతం వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలలో హీరోగా నటిస్తున్నారు.
గతేడాది ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమా విడుదల కాగా వచ్చే ఏడాది సమ్మర్ రాధేశ్యామ్ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.ప్రభాస్ ప్రస్తుతం సలార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలోని చాలామంది స్టార్ హీరోయిన్లతో నటించిన ప్రభాస్ హీరోయిన్ రకుల్ తో మాత్రం కలిసి నటించలేదు.రకుల్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమయంలో ప్రభాస్ బాహుబలి సిరీస్ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ కాంబినేషన్ గురించి కూడా వార్తలు రాలేదు.
అయితే రకుల్ తమ్ముడు అజన్ తాజాగా ప్రభాస్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు అమన్ తెర వెనుక అనే చిత్రం ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు.

నూతన సంవత్సరం సందర్భంగా తెర వెనుక సినిమా విడుదల కానుండగా ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్న అమల్ తన తల్లి గృహిణి అని తండ్రి రిటైర్డ్ కల్నల్ అని చెప్పారు.రకుల్ ప్రభాస్ తో కలిసి నటిస్తే చూడాలని ఉందని అన్నారు.ప్రభాస్ హైట్ కు రకుల్ సరిపోతుందని.
తాను ప్రభాస్ ను ఇప్పటివరకు కలవకపోయినా ప్రభాస్ చాలా మంచి వ్యక్తి అని విన్నానని అమన్ తెలిపారు.
మరి వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ రకుల్ కు ఛాన్స్ ఇస్తారేమో చూడాల్సి ఉంది.
అమన్ రకుల్ సరైనోడు, నాన్నకు ప్రేమతో సినిమాల్లో అద్భుతంగా అద్భుతంగా నటించిందని.రకుల్ కు సినిమా ఇండస్ట్రీలో మంచు లక్ష్మీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పారు.
అక్క పెళ్లి గురించి తనకు ఏం తెలియదని అమన్ అన్నారు.