రాజ్యసభ ఎన్నికలకు( Rajya Sabha elections ) ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది.ఈ క్రమంలో తెలంగాణ( Telangana )లో మూడు స్థానాలు, ఏపీలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
కాగా నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది.ఈ నెల 15వ తేదీ వరకు నామినేషన్ల దాఖలు చేసేందుకు గడువు ఉంది.
అలాగే ఈనెల 16న నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు.ఈనెల 20వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు విధించారు.అయితే తెలంగాణలో ఉన్న మూడు రాజ్యసభ స్థానాల్లో అధికార పార్టీ కాంగ్రెస్( Congress ) కు రెండు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు ఒక స్థానం వచ్చే అవకాశం ఉంది.ఈ క్రమంలోనే కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీఆర్ఎస్ నుంచి ఒకరు నామినేషన్ వేస్తే ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది.
అలా కాకుండా మూడు కన్నా ఎక్కువ నామినేషన్లు కనుక దాఖలు అయితే ఎన్నికలను నిర్వహించాల్సి వస్తుంది.ఈ నేపథ్యంలో ఈ నెల 27వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్న అధికారులు అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు.