ఆగస్ట్ 4 న విడుదలకు సిద్ధం అవుతోన్న "రాజుగారి కోడిపులావ్" యు ట్యూబ్ షేక్ చేస్తున్న చిత్ర ట్రైలర్

ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం “రాజు గారి కోడిపులావ్”( Rajugari Kodipulao ) కుటుంబ కథా ‘వి’చిత్రం అనేది ట్యాగ్.ఈ సినిమా ద్వారా శివ కోన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

 Rajugari Kodipulao Movie Set To Release On August 4th, Rajugari Kodipulao,etv-TeluguStop.com

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, వీడియోలు మూవీ లవర్స్ అందరి దృష్టిని విపరీతంగా ఆకట్టుకొన్నాయి.ఈ సినిమా ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా యూట్యూబ్ ను షేక్ చేస్తూ 1 మిలియన్ మైలురాయి దిశగా వేగవంతంగా దూసుకెళ్తోంది.

చిన్న సినిమాగా ప్రారంభమైన ఈ చిత్రం ఇంతలా ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందుతుంది అనడానికి ట్రైలర్ నిదర్శనగా నిలిచింది.ఇక ట్రైలర్( Rajugari Kodipulao Trailer ) చూసిన సినిమా ప్రేక్షకులు కథ ఇంకెంత వైవిధ్యంగా ఉంటుందోనని సినిమా విడుదల కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.

రాజు గారి కోడి పులావ్ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా “వాట్ ద ఫ* ఈజ్ ఆఫ్ కోడిపులావ్” అనే మరో ఇంట్రెస్టింగ్ వీడియోను విడుదల చేశారు.ఆధ్యాంతం ఉత్కంఠ భరితంగా సాగే ఈ చిత్రంలో జోకర్ పాత్ర ఎంతో కీలకం.

అలాంటి జోకర్ రోల్ ను రివిల్ చేస్తూ విడుదల చేసిన ఈ వీడియో కూడా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణను చురగొంది.అలాగే ఈ చిత్రంలో నుంచి విడుదలైన సునో సునారే సాంగ్( Suno Sunaro Song ) కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

సినిమాలో అందరూ కొత్త నటులే అయినప్పటికీ వారి పెర్ఫామెన్స్ తో సినిమాపై ప్రేక్షకుడి ఆసక్తి పెరుగుతోంది.బుల్లితెర మెగాస్టార్ ఈటీవీ ప్రభాకర్ ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తున్నారు.

దీంతో ఈ చిత్రంపై ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి.అయితే బ్రాడ్ మైండ్ ఉన్నవారు చూసేలా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ జారీ చేసింది.

ఇక సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్, వారి పిఆర్ఓ టీం రకరకాల సోషల్ మీడియా( Social Media ) మాధ్యమాల్లో తగినంత హైప్ తీసుకొస్తున్నారు.అలాగే చిత్రం విడుదల తేదీ కూడా దగ్గర పడుతూ ఉండడంతో అనేక ప్లాట్ ఫార్మ్స్ లో చిత్ర యూనిట్ ప్రమోషన్ లో పాల్గొంటూ మంచి అంచనాలను క్రియేట్ చేస్తున్నారు.

చిత్రం ఔట్ ఫుట్ పై ఎంతో నమ్మకంగా ఉన్న మూవీ యూనిట్ ఆగస్టు 4న ప్రేక్షకుడి స్పందన కోసం ఆత్రంగా ఎదురు చూస్తోంది.మంచి కంటెంట్ తో సినిమా తీస్తే, ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని చిన్న హీరోనా, పెద్ద హీరోనా అనే తేడా ఏమాత్రం చూపరని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.

ఈ చిత్రంలో శివ కోన ఈటీవీ ప్రభాకర్( ETV Prabhakar ), నేహా దేశ్ పాండే, కునాల్ కౌశల్, ప్రాచీ కెథర్, రమ్య దేష్, అభిలాష్ బండారి తదితరులు నటిస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ పనులు ఊపందుకున్నాయి.

ట్రైలర్లో చూపించినట్లు ప్రతి సీన్ చాలా కొత్తగా, వైవిధ్యంగా, ఎంతో ఉత్కంఠ భరితంగా ఉంటుందని.ప్రేక్షకుడు సీటు అంచున కూర్చుని ఆసక్తిగా చూసే ఎన్నో అద్భుతమైన సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయని తెలుస్తోంది.

దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.ఈ సినిమాకు పవన్ గుంటుకు సినిమాటోగ్రాఫర్ అందించగా, ప్రవీణ్ మనీ సంగీతాన్ని అందించారు.

ఎడిటర్ గా బసవ పనిచేశారు.ప్రపంచవ్యాప్తంగా రాజు గారి కోడి పులావ్ ఆగస్ట్4 న విడుదల కావడానికి రంగం సిద్ధం అయింది.

నటీనటులు : శివ కోన( Shiva Kona ), ప్రభాకర్, కునల్ కౌశల్, నేహా దేష్ పాండే, ప్రాచి కెథర్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ తదితరులు

బ్యానర్ : ఏఎమ్ఎఫ్, కోన సినిమా
నిర్మాతలు : అనిల్ మోదుగ, శివ కోన
డైరెక్టర్ : శివ కోన
సంగీతం : ప్రవీణ్ మని
సినిమాటోగ్రఫి : పవన్ గుంటుకు
ఎడిటర్ : బసవా
సౌండ్ డిజైన్ : జీ.పురుషోత్తమ్ రాజు
వీఎఫ్ ఎక్స్ : అండీ చంగ్
సౌండ్ మిక్సింగ్ : ఏ రాజ్ కుమార్
రచన సహకారం,ప్రొడక్షన్ కంట్రోలర్ : రవి సంద్రన
పీఆర్ఓ : హరీష్, దినేష్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube