నా కెరియర్ లోనే ఇది అతి పెద్ద సినిమా.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాజమౌళి తన టాలెంట్ తో ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు.ఈయన దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో ఏకంగా తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పారు.

 Rajjamouli Interesting Comments About Mahesh Babu Movie,rajamouli,mahesh Babu,be-TeluguStop.com

ఇలా తెలుగు ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాజమౌళి తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా హాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఈ సినిమా చూసిన అనంతరం అనేకమంది హాలీవుడ్ టెక్నీషియన్లు దర్శకులు జక్కన్న పై పొగడ్తలు కురిపించారు.ఇదిలా ఉండగా తాజాగా రాజమౌళి హాలీవుడ్ ఫిలిం ఫెస్టివల్లో బియాండ్ ఫెస్ట్‌’లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని ప్రదర్శించారు.

ఈ స్క్రీనింగ్‌కు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది ఈ స్క్రీనింగ్ అనంతరం రాజమౌళి స్టాండింగ్ ఓఫియేషన్ ఇవ్వడమే కాకుండా వేదికపై వెళ్లి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఈయన తన తదుపరి చిత్రం మహేష్ బాబుతో చేయనున్నారు ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.

Telugu Fest, Biggest, Long, Mahesh Babu, Career, Rajamouli-Movie

మహేష్ బాబుతో తాను చేయబోయే సినిమా తన కెరీర్ లోనే అతిపెద్ద సినిమా అని ఇప్పటివరకు తాను అలాంటి సినిమాలను చేయలేదని తెలిపారు.ఈ సినిమా ఇండియాలోనే ట్రెండ్ అవుతుందని, ప్రపంచాన్ని చుట్టి వచ్చే ఒక సాహసికుడి కథగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని జక్కన్న మహేష్ సినిమా గురించి తెలియజేశారు.ఇక తాను అమెరికాలో ఫిలిం ఫెస్టివల్ కి వచ్చానని అనుకున్న కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రేక్షకులు తన సినిమాని ఆదరించిన తీరు చూస్తుంటే ఇది అమెరికా కాదు అమీర్ పేట అనిపిస్తుంది అంటూ ఈ సందర్భంగా జక్కన్న చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube