Rajinikanth : జైలర్ తో కంబ్యాక్ ఇచ్చిన రజినీకాంత్ ఖాతాలో మరో ప్లాప్…

సినిమా ఇండస్ట్రీలో ఒక సక్సెస్ రావడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని.అయితే ఈ రోజుల్లో సినిమా సక్సెస్ లు అనేవి వరుసగా వస్తున్నప్పటికీ వాటి నిలబెట్టుకునే ప్రాసెస్ లో హీరోలు చాలా వరకు తడబడుతున్నట్టుగా తెలుస్తుంది.

 Rajinikanths Comeback With Jailer Is Another Flop-TeluguStop.com

ఇక అందులో భాగంగానే తెలుగులో చాలామంది హీరోలు వరుస సక్సెస్ లు కొడుతున్నప్పటికీ వాటిని కాన్ స్టంట్ గా నిలబెట్టుకోవడంలో మాత్రం వెనుకబడి పోతున్నారు.

Telugu Jailer, Kochadian, Laal Salaam, Rajinikanth, Comebackjailer-Movie

ఇక అదే కోవలో సూపర్ స్టార్ రజనీకాంత్( Superstar Rajinikanth ) కూడా నిలుస్తున్నట్టుగా తెలుస్తుంది.చాలా సంవత్సరాల తర్వాత ఆయనకు జైలర్( Jailer ) సినిమాతో ఒక హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది.అయితే ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ ని కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్తాడు అనుకున్న క్రమంలో తన కూతురు అయిన ఐశ్వర్య రజనీ కాంత్ డైరెక్షన్ లో వచ్చిన లాల్ సలాం సినిమా( Laal Salaam movie ) లో రజినీకాంత్ గెస్ట్ అపీరియన్స్ చేసి మరో ఫ్లాప్ ని ముట్టుగట్టుకున్నట్టుగా తెలుస్తుంది.

 Rajinikanths Comeback With Jailer Is Another Flop-Rajinikanth : జైలర్-TeluguStop.com

అయితే ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకున్నట్టుగా తెలుస్తుంది.కూతురు కోసం ఇప్పటికే కొచ్చాడియన్( Kochadian ) అనే సినిమా చేసి ఒక భారీ డిజాస్టర్ ని మూట గట్టుకున్న రజినీకాంత్ ఇప్పుడు మరోసారి జైలర్ తో వచ్చిన సక్సెస్ ని కంటిన్యూ చేయలేకపోయాడని చాలామంది విమర్శకులు సైతం రజనీకాంత్ ను విమర్శిస్తున్నారు.

Telugu Jailer, Kochadian, Laal Salaam, Rajinikanth, Comebackjailer-Movie

ఇక ఇప్పుడూ ఈయన లోకేష్ కనకరాజ్( Lokesh Kanakaraj ) డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను అలరిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది… అయితే లోకేష్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా తెరకెక్కుతుంది కాబట్టి ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని చాలామంది ప్రేక్షకులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే ఇక మరోసారి రజినీకాంత్ బౌన్స్ బ్యాక్ అవుతాడు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube