జైలర్ హిట్ అవుతుందని అసలు అనుకోలేదు: రజనీకాంత్

బీస్ట్ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్( Nelson Deelip Kumar ) తన తదుపరి చిత్రాన్ని రజినీకాంత్ ( Rajinikanth ) తో జైలర్ సినిమా( Jailer Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.రజినీకాంత్ సుమారు మూడు సంవత్సరాల తర్వాత జైలర్ సినిమాతో ఎంతో మంచి హిట్ అందుకున్నారు.

 Didn't Think Jailer Would Become A Hit, Rajinikanth, Jailer Movie, Nelson Deelip-TeluguStop.com

ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అయిన సందర్భంలో ఈయన పలు ఆలయాలను సందర్శిస్తున్నారు.

ఇక ఈ సినిమా విడుదలకు ముందు రోజు ఈయన హిమాలయాలకు వెళ్లిన సంగతి మనకు తెలిసిందే.

Telugu Jailer, Nelsondeelip, Rajinikanth, Rishikesh, Swamidayananda-Movie

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన బీస్ట్ తర్వాత జైలర్ సినిమాని ప్రకటించిన తర్వాత చాలామంది రజనీకాంత్ కు ఈ సినిమా చేయొద్దని కూడా సలహాలు ఇచ్చారట.రజినీకాంత్ కథపై నమ్మకంతో ఈ సినిమా చేయడానికి కమిట్ అయ్యారని తెలుస్తుంది.అయితే తాజాగా రజనీకాంత్ రిషికేషన్లోని స్వామి దయానంద గురూజీ ఆశ్రమానికి వెళ్లారు.

అక్కడికి వెళ్లినటువంటి ఈయన మొదటిసారి జైలర్ సినిమా రిజల్ట్ గురించి స్పందించారు.

Telugu Jailer, Nelsondeelip, Rajinikanth, Rishikesh, Swamidayananda-Movie

ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ…ఈ సినిమా షూటింగ్ సమయంలో చాలా ఒత్తిడి ఉండేది కొన్ని సార్లు నేను కూడా చాలా ఒత్తిడికి గురయ్యానని రజనీకాంత్ తెలిపారు.ఒకానొక సమయంలో ఈ సినిమా హిట్ అవుతుందా అన్న సందేహం నాకు కూడా వచ్చింది అంటూ ఈ సందర్భంగా రజనీకాంత్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.అయితే ఆ సమయంలో నాకు స్వామీజీ గారు ఒక మాట చెప్పారు ఈ సినిమా గురించి ఎలాంటి కంగారు అవసరంలేదని తప్పకుండా హిట్ అవుతుందని చెప్పడంతో స్వామి గారు చెప్పిన తర్వాత ఈ సినిమా గురించి ఆలోచించడం వృధా అని భావించాను అనుకున్న విధంగానే ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలై భారీ విజయాన్ని అందుకుంది అంటూ ఈ సందర్భంగా రజినీకాంత్ సినిమా గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube