సాధారణంగా రజనీకాంత్( Rajinikanth ) సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుందంటే బాక్సాఫీస్ వద్ద ఉండే సందడి అంతాఇంతా కాదు.రజనీకాంత్ క్రేజ్, రేంజ్ వేరే లెవెల్ అనే సంగతి తెలిసిందే.
అయితే లాల్ సలామ్ సినిమా( Lal Salaam ) విషయంలో మాత్రం భిన్నంగా జరుగుతోంది.ఈ సినిమాలో విష్ణు విశాల్ హీరోగా రజనీకాంత్ కీలక పాత్రలో నటించారు.
రజనీకాంత్ పాత్రకు ప్రముఖ సినీ నటుడు సాయికుమార్ డబ్బింగ్ చెప్పడం గమనార్హం.
ఈ సినిమాను ఇప్పటికే థియేటర్లలో చూసిన రజనీకాంత్, విష్ణు విశాల్( Vishnu Vishal ) అభిమానులు, సాధారణ ప్రేక్షకులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
లాల్ సలామ్ కథ అద్భుతంగా ఉన్నా కథనం విషయంలో పొరపాట్లు జరిగాయని ఐశ్వర్య సినిమాను అద్బుతంగా తెరకెక్కించడంలో విఫలమయ్యారని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఫస్టాఫ్ తో పోల్చి చూస్తే సెకండాఫ్ బెటర్ గా ఉండటం గమనార్హం.

మతాన్ని నమ్మితే మనస్సులో ఉంచుకో మానవత్వాన్ని అందరితో పంచుకో అనే అద్భుతమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఏ.ఆర్.రెహమాన్( A.R.Rahman ) మ్యూజిక్, బీజీఎంతో ప్రేక్షకులను మెప్పించారు.రజనీకాంత్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా తమకు నచ్చిందని చెబుతున్నారు.మాజీ కెప్టెన్ కపిల్ దేవ్( Kapil Dev ) ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించారు.
సీనియర్ హీరోయిన్ జీవితా రాజశేఖర్( Jeevita Rajasekhar ) ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించడం గమనార్హం.

లాల్ సలాం సినిమా కలెక్షన్ల విషయంలో భారీ నష్టాలను మిగిల్చిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.రజనీకాంత్ భవిష్యత్తు సినిమాలతో మరిన్ని భారీ రికార్డ్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.రజనీకాంత్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా ఈ హీరో పారితోషికం కూడా భారీ రేంజ్ లో ఉంది.
అనవసరమైన పాత్రలు చేసి రజనీకాంత్ తన విలువను తగ్గించుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.రజనీకాంత్ ఏడాదికి ఒక సినిమా విడుదలయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.







