చిత్రం : కబాలి
బ్యానర్ : వి క్రియేషన్స్
దర్శకత్వం : పా రంజిత్
నిర్మాత : కలైపులి యస్ .తాను
సంగీతం : సంతోష్ నారాయణ్
విడుదల తేది : జలై 22, 2016
నటీనటులు : రజినీకాంత్, రాధికా ఆప్టే, విన్స్‌టన్ చాకో
ఈ మధ్య కాలం లో ఏ సినిమాకీ లేనంత హైప్ ని తెచ్చుకుంది కబాలి సినిమా.ఆఫీసులకి ఆఫీసులే శలవులు ఇచ్చేసే రేంజ్ లో సాగిన ఈ కబాలి హైప్ హెయిర్ కట్టింగ్ లు , ఎయిర్ ఏషియా విమానాలూ ఇవన్నీ కబాలి మేనియా లో మునిగిపోయే విధంగా సాగింది.సాధారణంగా రజినీకాంత్ సినిమా అంటే ఉండే క్రేజ్ కంటే వెయ్యి రెట్లు ఎక్కువగా ఈ కబాలి హడావిడి సాగింది.
కనీ వినీ ఎరుగని ఓపెనింగ్ లతో, ప్రీమియర్ షో లతో సాగిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్ లలోకి వచ్చింది.రండి కబాలి ఏ మేరకి మెప్పించాడో చూద్దాం.
కథ – పాజిటివ్ లు :
కబాలి – అనే గ్యాంగ్ స్టర్ కథ ఇది .మలేషియా జైలు లో దాదాపు ఇరవై సంవత్సరాలు క్రుంగిపోయిన తరవాత రజినీకాంత్ బయటకి రావడం అప్పటికి మలేషియా లో ఉన్న భారతీయులు పడుతున్న కష్టాలు చూసి ఇంకా పరిస్థితి దారుణంగా తయారు అయ్యింది అని బాధపడ్డం ఇలాంటి సంఘటనలతో ఫస్ట్ హాఫ్ సాగుతుంది.పాత డాన్ బయటకి వచ్చి కొత్త రైవల్స్ తో ఎలా ఆదుకున్నాడు అనేది మొదటి భాగం లో కవర్ చేసాడు.కబాలి ఇంటర్వెల్ కి వచ్చే సరికి రాధికా ఆప్టే- తన భార్య ని చంపిన వాడు ఎవరా అని వెతుకుతూ ఉంటె ఎవరు చంపారు అనే కోణం లో అతనికి ఆమె బతికే ఉంది అని తెలుస్తుంది.
అప్పుడు మొదలు అవుతుంది అసలు కథ.ఆమె అసలు బతికే ఉందా ? ఆమెని ఎవరు చంపాలి అనుకున్నారు.కబాలి తో ఆమె ఎలా కలిసింది ? ఇలాంటి వ్యవహారాల చుట్టూ తిరుగుతుంది సినిమా.ఇంటర్వెల్ బ్యాంగ్, రజిని నటన, ఇంట్రడక్షన్ , రాధికా ఆప్టే కోసం కబాలి పడే తపన ఇవన్నీ అద్భుతంగా తెరకి ఎక్కించాడు రంజిత్
నెగెటివ్ లు :
కబాలి కి అతిపెద్ద మైనస్ పాయింట్ ఆ సినిమా కథ అని చెప్పాలి.డైరెక్టర్ పా రంజిత్ అతి సాధారణమైన, ఎవ్వరినా చెప్పగలిగే కథని ఎందుకు ఎంచుకున్నాడో అతనికే తెలియాలి .చిన్నప్పటి నుంచీ మనందరం చూస్తున్న గ్యాంగ్ స్టర్ కథ ఇది.మొదట్లో సినిమా ని ఒక కొత్తం లోకం లోకి తీస్కెళ్ళి నట్టే తీసుకు వెళ్లి మళ్ళీ రొటీన్ మూసలో పడేసాడు.మలేషియా లో పెరిగిన గ్యాంగ్ స్టర్ లని అంతమొందించే కబాలి తన భార్యని చంపిన వాడిని తెలుస్కున్న తరవాత అయినా కథ కొత్తగా మార్చాలి, గానీ రంజిత్ అలా చెయ్యలేదు.
సెకండ్ హాఫ్ లో కథ ని ఏటేటో తిప్పుతూ అందులోనూ చాలా స్లో నేరేషన్ తో లాగించాడు.కొత్త డైరెక్టర్ అవ్వడం తో ప్రతీ సీన్ లో కొత్తదనం కోరుకుంటారు జనాలు, కొత్తదనం పక్కన పెడితే అదే పాత ఆవకాయ ని తోసేసాడు అందరి మోఖానా.
కామెడీ అనేది సినిమా మొత్తం మీద ఎక్కడా లేదు
మొత్తంగా :
మొత్తంగా చూస్తే కబాలి సినిమా హైప్ సినిమాలకి ఒక పాఠం అని చెప్పచ్చు.డైరెక్టర్ పా రంజిత్ అందరూ తీసేసిన కథనే ఎంచుకుని దానికి ఇంకా స్లో నారేషన్ రాసుకుని విసిగించాడు.
కొత్తగా రజినీకాంత్ ని చూడాలి అనుకున్న వారికి నచ్చుతుంది గానీ కథ విషయం లో కొత్త దనం కోరుకోవడం పాపమే అవుతుంది.మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఇవన్నీ బాగా సెట్ అయ్యాయి కూడా.
ఇవన్నీ ఉపయోగించుకోవడం లో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు అని చెప్పచ్చు.ఎమోషనల్ డ్రామా ని సరిగా నడిపి ఉంటె వేరేలా ఉండేది లెక్క.ఏదేమైనా ఈ సినిమా హిట్టు అవ్వాలి అంటే 150 కోట్ల షేర్ రావాలి, కనీసం ఎనభై కోట్లు అయినా వస్తుందా అనేది అనుమానమే.