సూపర్ స్టార్ రజినీకాంత్ రోబో సినిమా తర్వాత సాలిడ్ సక్సెస్ ను అందుకోవడం లో విఫలం అయ్యాడు.ఆ సినిమా తర్వాత రజినీకాంత్( Rajinikanth ) కెరీర్ క్లోజ్ అన్నట్లుగానే చాలా మంది భావించారు.
కానీ ఆయన మాత్రం ప్రయత్నిస్తూనే వచ్చాడు.ఎట్టకేలకు నెల్సన్ దిలీప్ దర్శకత్వం లో రూపొందిన జైలర్ సినిమా( Jailar movie ) భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
రజినీకాంత్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ మూవీగా నిలిచింది.అయిదు వందల కోట్ల కు పైగా వసూళ్లు నమోదు చేసింది.
తాజాగా ఈ సినిమా ను ఓటీటీ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు.ఇంకా థియేటర్ లలో ఉన్న ఈ సినిమాను అప్పుడే ఓటీటీ లో స్ట్రీమింగ్ ను చేయడం ను మొదట అభిమానులు తిరష్కరించారు.
కానీ సినిమా స్ట్రీమింగ్ అయిన తర్వాత తెగ చూస్తున్నారు.

తమిళనాడు తో పాటు ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా వంద కు పైగా దేశాల్లో జైలర్ సినిమా సందడి చేస్తోంది.జైలర్ సినిమా ను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున చూస్తున్న నేపథ్యం లో సూపర్ స్టామినా ఇది అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఆకట్టుకునే కథ మరియు కథనాలతో ఈ సినిమాను రూపొందించిన విషయం తెల్సిందే.
చాలా సంవత్సరాల తర్వాత యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్( Kamal Haasan ) విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

ఇలాంటి సమయంలో రజినీకాంత్ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యం లో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.కమల్ హాసన్ సక్సెస్ ను సొంతం చేసుకున్న ఈ సమయంలో రజినీకాంత్ అభిమానులు కళ్లు కాయలు కాసే విధంగా జైలర్ వైపు చూశారు.ఇప్పుడు వారి ఆనందానికి అవధులు లేవు.
ఇక నుండి రజినీకాంత్ వరుసగా వందల కోట్ల వసూళ్లు నమోదు చేస్తూ తన సినిమా లతో సత్తా చాటడం ఖాయం అంటున్నారు.రియల్ సూపర్ స్టార్ మా రజినీకాంత్ అంటూ అభిమానులు ఆనందం తో గంతులు వేస్తున్నారు.







