కోలీవుడ్ స్టార్ హీరోల్లో రజనీ కాంత్ ఒకరు.ఈయనకు టాలీవుడ్ లో మాత్రమే కాదు.
ఇండియా వైడ్ ఫాలోయింగ్ ఉంది.ఈయన ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే ఈ మధ్య కాలంలో రజినీ కాంత్ సినిమాలు అంతగా ప్రభావం చూపించడం లేదు.ఒక సినిమా హిట్ అయితే వరుస ప్లాప్స్ వస్తున్నాయి.
దీంతో రజనీ ఫ్యాన్స్ అంతా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు.
ప్రెసెంట్ రజనీ కాంత్ ‘జైలర్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవలే ఈ సినిమా నుండి పోస్టర్ రివీల్ చేసారు మేకర్స్.ఈ మాస్ పోస్టర్ సోషల్ మీడియాలో భారీ క్రేజ్ తెచ్చుకుంది.
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రజనీ కాంత్ కెరీర్ లో 169వ సినిమాగా తెరకెక్కుతుంది.ఇక ఈ సినిమాలో తమన్నా, రమ్య కృష్ణ కూడా నటిస్తున్నట్టు ఇప్పటికే కన్ఫర్మ్ చేసారు.
అలాగే ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తుండగా.భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది.రజనీకాంత్ దీంతో పాటు మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఈ రెండు సినిమాలను ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు అనే వివరాలు ఇంకా ప్రకటించలేదు.లేక వారితోనే రెండు సినిమాలు చేస్తానని రజనీ ఒప్పందం చేసుకున్నారు.
మరి ఈ రెండు సినిమాల కోసం చాలా మంది డైరెక్టర్ల పేర్లు వినిపిస్తున్నాయి.
మరి కోలీవుడ్ మీడియా చెబుతున్న దాని ప్రకారం ఇందులో ఒక సినిమాకు సూపర్ స్టార్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించనుంది అనే రూమర్స్ వినిపిస్తున్నాయి.ఈమె ఇప్పటికే దర్శకురాలిగా పరిచయం అయ్యింది.రెండు సినిమాలను చేసిన ఈమె మూడవ సినిమా తండ్రితో చేయనుంది అని అంటున్నారు.
ఇప్పటికే చిన్న కూతురు దర్శకత్వంలో సినిమా చేసిన రజనీ ఇప్పుడు పెద్ద కుమార్తె దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు అని అంటున్నారు.ఇందులో నిజమెంతో తెలియాలంటే మరో మూడు రోజులు వేచిఉండాల్సిందే.