బాలీవుడ్ సీరియల్ నటి అసోపా, రాజీవ్ సేన్ గురించి మనందరికీ తెలిసిందే.గత కొద్ది రోజులుగా ఈ జంట గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.
పెళ్లి జరిగిన ఏడాదికే విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.కూతురు కోసం మళ్లీ కలిసి ఉండాలి అని నిర్ణయించుకున్న ఈ దంపతులు తాజాగా మళ్లీ విడిపోవాలి అనుకున్నట్లు ప్రకటించారు.
అసలేం జరిగిందంటే.బాలీవుడ్ నటి సుష్మితా సేన్ తమ్ముడు రాజీవ్ సేన్ సీనియర్ నటి చారు అసోఫా2019లో పెళ్లి చేసుకున్నారు.
కాగా వీరిద్దరి లవ్ మ్యారేజ్ కావడం విశేషం.ఈ జంటకు ప్రస్తుతం 11 నెలల పాప కూడా ఉంది.
తన భర్త వల్ల కెరీర్ పూర్తిగా నాశనమైందని కన్నీరు పెట్టుకుంది.తన ప్రెగ్నెన్సీ సమయంలో రాజీవ్ తనని మోసం చేశాడని ఈ నటి ఆరోపించింది.పెళ్లి జరిగినప్పటి నుంచి రాజీవ్ సేన్ తనని ఇబ్బంది పెడుతూనే ఉన్నట్లు ఆమె తెలిపింది.ఈ గొడవల వల్ల మానసికంగా కృంగిపోయాను.
మా మధ్య గొడవ జరిగిన ప్రతిసారి రాజు నన్ను వదిలి వెళ్ళిపోయేవాడు.అలా కరోనా సమయంలో రాజీవ్ నా నుంచి మూడు నెలలు దూరంగా ఉన్నాడు అని చెప్పుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది చారు అసోపా.
అంతేకాకుండా నా మొబైల్ నెంబర్లు బ్లాక్ చేశాడు.ఆ బాధ నుంచి బయటపడటానికి మళ్లీ పనిపై దృష్టి పెట్టాను.
ఈ క్రమంలోనే అక్బర్ కా బల్ బీర్బల్ షూటింగ్లో పాల్గొన్న కొన్ని రోజులకే రాజీవ్ మళ్ళీ తిరిగి వచ్చాడు.నా పనిలోకి జోక్యం చేసుకున్నాడు.నా తోటి నటులందరికీ నా గురించి మెసేజ్లు పెట్టి బెదిరించడంతో నన్ను షోలో నుంచి తీసేసారు.దీంతో నేను విడాకుల కోసం అప్లై చేస్తే నన్ను బాగా చూసుకుంటాను అను మాట ఇచ్చాడు.
సరేలే అని డివోర్స్ వెనక్కి తీసుకోగా రాజీవ్ తీరు మారలేదు మళ్ళీ వేదించడం మొదలు పెట్టాడు.అందుకే అతనితో పూర్తిగా విడాకులు తీసుకొని విడిపోవాలని నిర్ణయించుకున్నాను అని ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది చారు అసోపా.