కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కీలక వ్యాఖ్యలు చేశారు.పార్టీ అధిష్టానం తనకు అన్ని ఇచ్చిందన్న ఆయన.
ఏ బాధ్యత అప్పగించినా చేస్తానని తెలిపారు.దేశ వ్యాప్తంగా పార్టీ కార్యకర్తల అభిమానం చూరగొనడం, వారి నమ్మకాన్ని పొందడంపై ఆనందం వ్యక్తం చేశారు.
అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలా.? లేక రాజస్థాన్ కే పరిమితం కావాలా అనే విషయంపై కార్యకర్తల అభిప్రాయానికి కట్టుబడి ఉంటానని వెల్లడించారు.అదేవిధంగా రాహుల్ గాంధీకి మరోసారి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు.







