ఆ కోటలో దెయ్యాలు ఉన్నాయా..? దెయ్యాలున్నాయంటూ బోర్డ్ పెట్టిన ప్రభుత్వం..!

ప్రస్తుతం ప్రపంచంలో టెక్నాలజీ ఏవిధంగా రోజురోజుకి మారిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఓవైపు ప్రపంచం టెక్నాలజీ పరంగా దూసుకు వెళ్తుంటే.

మరికొందరు మాత్రం మూఢనమ్మకాలు అంటూ కొన్ని పనులను చేయడం మనం గమనిస్తూనే ఉంటాం.అయితే మూఢనమ్మకాలని నమ్మకూడదు అని ప్రచారం చేసే ప్రభుత్వాలే అక్కడ దెయ్యాలు ఉన్నాయి అంటూ బోర్డు పెట్టింది అని సమాచారం.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.ఆ కోటలో ఉదయం పూట వచ్చిపోయే పర్యటకులతో బాగా కిటకిటలాడుతుంది.

అయితే రాత్రి అవ్వగానే అక్కడ ఓ జీవి కూడా అక్కడ కనిపించదు.అయితే ఇందుకు కారణం లేకపోలేదు.

Advertisement

రాత్రి సమయం అయిందంటే చాలు ఆ కోట నుండి గజ్జెలతో అలాగే సన్నని కూనిరాగాలు వినబడతాయి.దీంతో ప్రజలు అక్కడికి పూట మాత్రం అసలు వెళ్లరు.

అంతే కాదు ఎవరైనా తెలియక అక్కడికి వెళ్లాలని భావించిన కూడా స్థానికులు అక్కడికి వెళ్లనివ్వరు.ఈ ప్రాంతం రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ఈ కోట పేరు భాన్ గఢ్ కోట.

ఈ కోట చరిత్ర చూస్తే 1537 లో రాజు భగవాన్ దాస్ కొడుకు మాధవ్ సింగ్ కోసం ఆ కోటను కట్టించారు.అలా తన కొడుకు కోసం కట్టించగా తన కొడుకు మరణానంతరం అతని కొడుకు చిత్ర సింగ్ వశమైంది ఈ కోట.ఇకపోతే 1600 ప్రాంతంలో చిత్ర సింగ్ చనిపోయారు.ఇక 1700 సంవత్సరం నుండి ఆ కోటకు వైభవం పూర్తిగా కోల్పోయింది.

ఇలా ఆ కోట చరిత్ర కాస్త ఘనంగానే ఉంది.ఇకపోతే ఈ కోటలో అలా శబ్దాలు రావడానికి గల కారణం అక్కడ ఓ కథను చెప్పుకుంటారు.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

అదేమిటంటే.ఆ కోటకు వైభవం కోల్పోయిన తర్వాత అక్కడ బాబా భోలేనాథ్ అనే వ్యక్తి వచ్చి తపస్సు చేసుకుంటూ ఉండగా అక్కడికి ఓ రోజు వచ్చి ఆ కోటను తాను ఆక్రమించుకుంటానని మళ్లీ అక్కడ మరో కోటని నిర్మిస్తానని తెలపగా అందుకు బాబా భోలేనాథ్ సమ్మతం తెలిపారట.

Advertisement

అయితే ఆ బాబా భోలేనాథ్ షరతు పెట్టాడు.తనపై ఆ కోట నీడ పడకుండా నిర్మాణం చేయమని తెలిపాడు.

ఆ బాబా చెప్పిన విధంగానే కోట నీడ పడకుండా నిర్మాణం చేయడం మొదలుపెట్టాడు.

అయితే అనుకోకుండా ఆ బాబా చనిపోవడం, ఆ తర్వాత ఆయన చెప్పిన మాటలను కూడా మర్చిపోవడం రాజు చేశాడు.దీంతో ఆ కోట ఎత్తు పెరిగి ఆ కోట నీడ బాబా సమాధి మీద పడటంతో దాంతో అప్పటి నుంచి ఆ కోట నుండి వింత శబ్దాలు మొదలైనట్లు అక్కడి స్థానికులు తెలుపుతారు.దీంతో ఏకంగా భారతీయ పురావస్తు శాఖ సంబంధించిన వారే స్వయంగా ఆ కోటకు రాత్రిపూట రావద్దని బోర్డు పెట్టారంటే అక్కడ ఎంత భయంకరమైన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

తాజా వార్తలు