హీరో రాజశేఖర్ కూతురితో రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి.. అసలేం జరిగిందంటే?

బిగ్ బాస్ షో సీజన్3 కు విన్నర్ గా నిలవడం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో రాహుల్ సిప్లిగంజ్ పేరు మారుమ్రోగింది.తన టాలెంట్ తో రాహుల్ సిప్లిగంజ్ అంతకంతకూ ఎదుగుతుండగా రాహుల్ సిప్లిగంజ్ పాడిన నాటు నాటు సాంగ్ కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే.

 Rajasekhar Daughter Marriage With Rahul Sipligunj Rangamarthanda Movie Details,-TeluguStop.com

రాహుల్ సిప్లిగంజ్ ఒకవైపు సింగర్ గా కొనసాగుతూనే మరోవైపు నటుడిగా సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

అయితే హీరో రాజశేఖర్ కూతురితో రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి జరిగింది.

ఈ పెళ్లి సినిమాలో జరిగిన పెళ్లి కావడం గమనార్హం.రంగమార్తాండ సినిమాలో రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక జంటగా నటించారు.

చాలా కాలం నుంచి ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా తాజాగా ఈ సినిమా నుంచి పోస్టర్ విడుదలైంది.రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.

ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.

Telugu Krishna Vamsi, Ilaya Raja, Prakash Raj, Rahul Sipligunj, Rajasekhar, Ramy

కృష్ణవంశీ ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.రంగమార్తాండ ఒకింత భారీ బడ్జెట్ తోనే తెరకెక్కింది.ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందించడం గమనార్హం.

ఈ సినిమాతో పూర్వ వైభవం వస్తుందని కృష్ణవంశీ భావిస్తుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.నిన్నే పెళ్లాడతా సినిమా తరహాలో ఈ పోస్టర్ ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

Telugu Krishna Vamsi, Ilaya Raja, Prakash Raj, Rahul Sipligunj, Rajasekhar, Ramy

రాహుల్ సిప్లిగంజ్, శివాత్మికలకు ఈ సినిమాతో ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాల్సి ఉంది.రీమేక్ సినిమాగా తెరకెక్కిన రంగమార్తాండ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.మరి ఈ సినిమా అంచనాలను మించి మెప్పిస్తుందో లేదో చూడాలి.రంగమార్తాండ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube