ప్రపంచవ్యాప్తంగా విశేష అభిమాన గణాన్ని సంపాదించుకున్న సూపర్ స్టార్గా పేరు గాంచిన రజనీకాంత్( Rajinikanth ) ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనవసరంగా వేలు పెట్టారా అని ఆయన అభిమానులు ఫీల్ అవుతున్నారట.తమ హీరోకు సంబంధం లేని విషయం లో ఆయనను ముడిపెట్టి విమర్శలు చేస్తున్న వైసీపీ పార్టీ( YCP ) పట్ల తలైవా అభిమానులు కోపంతో రగిలిపోతున్నారు .
వివరాల్లోకి వెళితే ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం కోసం రజనీకాంత్ ను ప్రత్యేక అతిది గా ఆహ్వానించారు, పిలిచింది ఒక మాజీ ముఖ్యమంత్రి కావటం అందులోనూ సినీ కుటుంబానికి సంబంధించిన మేరు నగదీరుడు గా పేరుగాంచిన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలు కావడంతో ఆహ్వానాన్ని మన్నించి ఆయన వచ్చారు ….

వచ్చిన సందర్బాన్ని అనుసరించి తారక రామారావు గారి యొక్క గొప్పతనం గురించి ఆయనతో తనకున్న సాన్నిహిత్యం గురించి ఆయన వివరించారు పనిలోపనిగా చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) గారి లీడర్షిప్ గురించి ఆయన విజన్ గురించి .ఆయన ప్రణాళికల వల్ల డెవలప్ అయిన హైదరాబాద్ గురించి నాలుగు మాటలు గొప్పగా చెప్పారు .అదేమంత తప్పు కానప్పటికీ ఆ మాటలే ఇప్పుడు వైసీపీ పాలిట ఆయనను విలన్ గా మార్చాయి రజనీకాంత్ ని విమర్శిస్తూ వైసిపి ఫైర్ బ్రాండ్స్ అయిన .కొడాలి నాని, మంత్రి రోజా లాంటి వారు చంద్రబాబు తో పాటు రజనీకాంత్ ను విమర్శిస్తూ ప్రెస్మీట్లు పెట్టారు .

కొడాలి నాని అయితే ఒక అడుగు ముందుకేసి రజినీకాంత్ తన వ్యక్తిత్వాన్ని దిగజార్చుకున్నారని కూడా ఘాటు విమర్శలు చేశారు ….అసలు తమకు సంబంధం లేని విషయం పట్ల తమ ఆరాధ్య దైవం లాంటి హీరోను ఇన్ని విమర్శలు చేసిన వైసీపీ నాయకుల పట్ల తలైవా అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు .వైసీపీ ప్రభుత్వ పనితీరును ఏకిపారేస్తున్నారు.ఈ మొత్తం ఎపిసోడ్ ను ఒకసారి నిశితం గా గమనిస్తే మొహమాటంతో ఈ కార్యక్రమానికి వచ్చినందున అనవసరంగా ఇన్ని మాటలు రజనీకాంత్ పడవలసి వచ్చిందని ఆయన ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయినట్టుగా అయ్యిందంటూ ఆయన అభిమానులు బాధపడుతున్నారు ….







