జక్కన్న చేతుల మీదుగా మహేష్ మేనల్లుడు 'హీరో' సినిమా ట్రైలర్!

మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి మనవడు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అయిన గల్లా అశోక్ హీరోగా నటించిన తొలి సినిమా హీరో.

గల్లా అరుణ కుమారి, సూపర్ స్టార్ కృష్ణ సమర్పణలో అమర రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా పద్మావతి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 15వ తేదీన విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ కూడా స్పీడ్ గా చేస్తున్నారు.

సంక్రాంతి కానుకగా పెద్ద సినిమాలు అయిన ఆర్ ఆర్ ఆర్, రాధేశ్యామ్ సినిమాలు వాయిదా వేసిన విషయం తెలిసిందే.కరోనా కొత్త వేరియంట్ విజృంభించడంతో ఈ సినిమాలు వాయిదా పడ్డాయి.

అయితే పెద్ద పెద్ద సినిమాలు బరిలో లేకపోవడంతో చిన్న సినిమాలు సంక్రాంతి రేస్ లోకి వచ్చాయి.అందులో గల్లా అశోక్ నటించిన హీరో సినిమా కూడా ఉంది.

Advertisement

ఈ సినిమా ట్రైలర్ ను మహేష్ బాబు లేదా తాతగారు కృష్ణ చేతుల మీదుగా విడుదల చేస్తారని అంతా అనుకున్నారు.కానీ అనూహ్యంగా ఈ ట్రైలర్ అగ్ర దర్శకుడు రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేయబోతున్నట్టుగా అధికారికంగా పోస్టర్ ద్వారా ప్రకటించారు.

జక్కన్న చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అయితే ఈ సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ దక్కడం ఖాయం.

కృష్ణ కుమారుడు మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మృతి చెందిన విషయం తెలిసిందే.దీంతో కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన లేకపోతున్నారు.అందుకే ఈ సినిమా ట్రైలర్ ను రాజమౌళి చేతుల మీదుగా రిలీజ్ చేయాలనీ భావించారట.

ఏది ఏమైనప్పటికి రాజమౌళి కారణంగా ఈ సినిమా పబ్లిసిటీ పెరగడం ఖాయం.ఈ రోజు సాయంత్రం 4.05 నిముషాలకు ఈ ట్రైలర్ ను రాజమౌళి చేతుల మీదుగా రిలీజ్ చేయబోతున్నారు.సంక్రాంతి బరిలో ఉన్న పలు సినిమాల్లో హీరో కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

ఆ నటుడు నన్ను చూపుతోనే భయపెట్టాడు.. రజనీకాంత్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
నడుము అందాలతో తెల్ల చీరలో క్యూట్​గా పూజా

మహేష్ బాబు మేనల్లుడు కావడం వల్ల ఈ సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ బాగా రావడం ఖాయం.మరి ఈ సినిమా పేక్షకులను ఏ మాత్రం మెప్పిస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు