టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన ఆర్‌ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా లోని నాటు నాటు ఏకంగా ఆస్కార్ అవార్డు కు నామినేట్ అయ్యింది.
ఈ నెలలో జరగబోతున్న ఆస్కార్ అవార్డు వేడుకలు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొనబోతున్నారు.అందుకోసం ఇప్పటికే రామ్ చరణ్ మరియు కొందరు యూనిట్ సభ్యులు అమెరికా వెళ్లారు.
త్వరలోనే ఎన్టీఆర్ మరియు ఇతర చిత్ర యూనిట్ సభ్యులు అమెరికా వెళ్ళబోతున్నారు అనే సమాచారం అందుతోంది.అంతర్జాతీయ మీడియా లో పెద్ద ఎత్తున సినిమా గురించి ప్రచారం చేస్తున్నారు.
అందుకోసం చిత్ర యూనిట్ సభ్యులు భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
ఆర్ ఆర్ ఆర్ సినిమా ని నిర్మించిన నిర్మాత దానయ్య ఎక్కడ కూడా కనిపించడం లేదు.ఆయన సినిమా కి ప్రస్తుతం ఖర్చు చేయడం లేదు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.ప్రస్తుతం ఆస్కార్ పబ్లిసిటీ కోసం ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి కూడా రాజమౌళి సొంత డబ్బు అంటూ వార్తలు వస్తున్నాయి.ఈ సినిమా వల్ల రాజమౌళి దాదాపుగా రూ.250 కోట్ల నుండి రూ.300 కోట్ల వరకు సంపాదించారు అనేది సమాచారం.]
అందుకే ఇప్పుడు అందులో చాలా వరకు సినిమా ప్రచారం కోసం ఖర్చు చేస్తున్నాడని తెలుస్తోంది.మొత్తానికి జక్కన్న రాజమౌళి చేస్తున్న ఈ ప్రయత్నం ఎంత వరకు సఫలం అవుతుంది అని చూడాలి.నాటు నాటు పాట ఆస్కార్ అవార్డ్ ని సొంతం చేయించుకుంటే కచ్చితంగా అద్భుతం అనుకోవచ్చు.
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇండియన్ సినిమా కుఆస్కార్ అవార్డు సొంతమైనది.రాజమౌళి తో పాటు ప్రతి ఒక్కరికి కూడా గర్వకారణం అవుతుంది.రాబోయే పదుల సంవత్సరాల పాటు ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకునే విధంగా కూడా ఉంటుందని అంతా చర్చించుకుంటున్నారు.