బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో కాంట్రవర్సీ క్వీన్ కంగనా రౌనత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సక్సెస్ అందుకున్నారు.
అయితే ఇండస్ట్రీలో ఈమె తరుచూ నెపోటిజం గురించి మాట్లాడుతూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తుంటారు.ఈ విధంగా ఇండస్ట్రీకి సంబంధించిన వారి విషయాలు మాత్రమే కాకుండా ఇతర విషయాల గురించి కూడా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటారు.

ఈ క్రమంలోనే తాజాగా పెళ్లి గురించి ఈమె మాట్లాడుతూ చాలా బోల్డ్ కామెంట్స్ చేశారు.ముఖ్యంగా 1997 నుంచి 2012 మధ్య ఉన్నటువంటి జనరేషన్ వారి మనస్తత్వం పెళ్లి పట్ల వారు తీసుకుని నిర్ణయాల గురించి ఈమె మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా కంగనా మాట్లాడుతూ ఈ సంవత్సరాల వ్యవధిలో జన్మించిన వారు పూర్తిగా సెల్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారని ఈమె తెలియజేశారు.డబ్బులు లేవనే కమిట్మెంట్ తోపాటు పెళ్లిళ్లు చేసుకోవడానికి కూడా భయపడుతున్నారని ఈమె తెలియజేశారు.

ఇలాంటి వారిలో పెళ్లి అంటే భయం ఉండటమే కాకుండా సె** అంటే చాలా బద్ధకంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు.ఇక ఇలాంటివారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే క్రమశిక్షణతో పెరిగినవారు అంటే వీరికి ఏమాత్రం ఇష్టం ఉండదు.షార్ట్ కట్ గా చాలా తక్కువ సమయంలోనే సక్సెస్ సాధించిన వారు వీరి దృష్టిలో హీరోలుగా ఉంటారని ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక కంగనా సినిమాల విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో ఈమె బాలీవుడ్ సినిమాలకు కాస్త దూరమైనప్పటికీ సౌత్ సినిమాలపై మక్కువ పెంచుకున్నారు.
ఈ క్రమంలోనే రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నటువంటి చంద్రముఖి 2 సినిమాలో చంద్రముఖి పాత్రలో నటిస్తున్నారు.







