ఆర్ఆర్ఆర్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇవే.. బాహుబలి2 కంటే ఎంత ఎక్కువంటే?

బాహుబలి ది కంక్లూజన్ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు.బాహుబలి2 తర్వాత వందల సంఖ్యలో సినిమాలు విడుదలైనా ఇప్పటికీ బాహుబలి2 సినిమాపై ఎన్నో చెక్కుచెదరని రికార్డులు ఉన్నాయి.రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, ప్రభాస్ రానాల అద్భుతమైన నటన బాహుబలి2 సక్సెస్ కు కారణమయ్యాయి.భాషతో సంబంధం లేకుండా విడుదలైన ప్రతి భాషలో ఈ సినిమా సక్సెస్ సాధించింది.

 Rajamouli Rrr Movie Pre Release Business Details Here Goes Viral , Rajamouli , R-TeluguStop.com

సినిమాలో చిన్నచిన్న లోపాలున్నా రాజమౌళి తన టాలెంట్ తో ఎన్నో అద్భుతమైన సీన్లు సినిమాలో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవడంతో బాహుబలి2 బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది.ఆ సినిమా విడుదలైన తర్వాత దాదాపుగా ఐదేళ్ల పాటు జక్కన్న ఆర్ఆర్ఆర్ మూవీకే పరిమితమయ్యారు.

ఆర్ఆర్ఆర్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు కళ్లు చెదిరే స్థాయిలో ఉన్నాయి. చరణ్, తారక్ లకు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండటంతో బయ్యర్లు అంచనాలకు మించి పెట్టుబడులు పెట్టి ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశారు.

Telugu Bahubali, Charan, Prabhas, Pre, Rajamouli, Rana, Rrr, Tarak, Theatrical,

ఆర్ఆర్ఆర్ నైజాం హక్కులు 75 కోట్ల రూపాయలకు అమ్ముడవగా సీడెడ్ హక్కులు 45 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.ఈ సినిమా సీడెడ్ హక్కులకు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నా అసలు లెక్కలు మాత్రం ఇవేనని సమాచారం.ఆర్ఆర్ఆర్ వైజాగ్ ఏరియా హక్కులు 23 కోట్ల రూపాయలకు అమ్ముడవగా ఉభయ గోదావరి జిల్లాల హక్కులు 30 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం.కృష్ణా హక్కులు 14 కోట్ల రూపాయలకు, గుంటూరు హక్కులు 17 కోట్ల రూపాయలకు, నెల్లూరు హక్కులు 9 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని బోగట్టా.

Telugu Bahubali, Charan, Prabhas, Pre, Rajamouli, Rana, Rrr, Tarak, Theatrical,

ఆర్ఆర్ఆర్ తెలుగు రాష్ట్రాల హక్కులు ఏకంగా 213 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.ఓవర్సీస్ 75 కోట్లు, హిందీ 92 కోట్లు, కర్ణాటక 41 కోట్లు, తమిళనాడు 35 కోట్లు, కేరళ 9 కోట్లు, రెస్టాఫ్ ఇండియా హక్కులు 8 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్టు బోగట్టా.మొత్తం 473 కోట్ల రూపాయలకు ఆర్ఆర్ఆర్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి.కనీసం 500 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సాధిస్తే ఈ సినిమా హిట్ అనిపించుకుంటుంది.పోటీ లేకపోవడం, టికెట్ రేట్లు పెరగడం ఈ సినిమాకు కలిసొచ్చింది.బాహుబలి2 కంటే 100 కోట్ల రూపాయలు ఎక్కువ మొత్తానికి ఈ సినిమా హక్కులు అమ్ముడయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube