తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి డైరెక్టర్ రాజమౌళి( Rajamouli )తో సినిమా అంటే మామూలుగా ఉండదనే విషయం అందరికీ తెలిసిందే.ఒకసారి రాజమౌళి కాంపౌండ్ లోకి అడుగుపెట్టాము అంటే దాదాపు రెండు మూడు సంవత్సరాల పాటు వేరే సినిమా చేయడానికి అవకాశం లేకుండా ఆయన సినిమాతోనే బిజీగా ఉండాల్సిన పరిస్థితిలు ఏర్పడుతుంటాయి.
ఇలా పలువురు స్టార్ హీరోలు అందరూ కూడా రాజమౌళితో కొన్ని సంవత్సరాల పాటు కలిసి జర్నీ చేసి సినిమాలను పూర్తి చేశారు.ఎన్టీఆర్ రామ్ చరణ్ లతో కలిసి RRR చేసిన రాజమౌళి ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) తో ఒక అడ్వెంచర్స్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ మొత్తం విజయేంద్రప్రసాద్( Vijayendra Prasad ) పూర్తి చేశారని ఈ స్క్రిప్ట్ తుది మెరుగులు రాజమౌళి దిద్దుతున్నారని తెలుస్తుంది.ఇప్పటికే మహేష్ బాబుకు ఈ సినిమాలో ఎలా ఉండాలి లుక్ ఏంటి అన్న విషయాల గురించి కూడా చర్చలు జరిగాయని తెలుస్తోంది.మహేష్ బాబు గుంటూరు కారం ( Guntur Kaaram ) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నార.ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది.
ఈ సినిమా పూర్తి కాగానే మహేష్ బాబు రాజమౌళి సినిమాతో బిజీ కానున్నారు.హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసుకోకుండా ఈ సినిమా ఆఫ్రికా అడవులలో ఒక అడ్వెంచర్స్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలియడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి.

ఇక ఈ సినిమా గురించి తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది.ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.ఇది ఇండియానా జోన్స్ తరహాలో ఉండే సినిమా అని చెప్పడం వల్ల తప్పకుండా రెండో భాగం కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది.ఇక ఈ విషయం తెలియడంతో చాలామంది మహేష్ బాబు రాజమౌళి కాంపౌండ్ లోకి అడుగుపెడితే నాలుగేళ్ల పాటు అక్కడే ఉండాల్సి ఉంటుందని, ప్రభాస్ ( Prabhas ) కూడా గతంలో బాహుబలి( Baahubali ) సినిమా కోసం దాదాపు నాలుగు సంవత్సరాల పాటు పని చేశారని, ఇప్పుడు మహేష్ పరిస్థితి కూడా అలాగే ఉండబోతుందని తెలుస్తుంది.
ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు ఒకవైపు తమ హీరో రాజమౌళితో సినిమా చేస్తున్నారన్న ఆనందం ఉన్నప్పటికీ నాలుగు సంవత్సరాల పాటు ఈయన మరో సినిమా చేసే అవకాశం లేదని ఆవేదన కూడా చెందుతున్నారు.







