ప్రియాంక చోప్రాతో జక్కన్న హాలీవుడ్ మూవీ.. నిజమేనా?

మన అగ్ర డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా గోల్డెన్ గ్లొబ్ అవార్డ్స్ 2023లో ఇండియన్ సినిమా గర్వించదగ్గ మూమెంట్ చోటు చేసుకుంది.80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ నుండి ”నాటు నాటు” సాంగ్ కు అవార్డ్ దక్కిన విషయం తెలిసిందే.ఈ అవార్డు వచ్చిన నేపథ్యంలో రాజమౌళిని ఇండియన్ ప్రముఖులు అభినందనలు చెబుతూ పొగడ్తలు కురిపిస్తున్నారు.

 Rajamouli Hollywood Movie With Priyanka Chopra Details, Priyanka Chopra, Rajamou-TeluguStop.com

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి అగ్రతారలు అభినందనలు తెలిపారు.

ఇక తాజాగా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా సైతం రాజమౌళిని ప్రశంసిస్తూ నెట్టింట పోస్ట్ చేసింది.ఈమె సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ.ఆర్ ఆర్ ఆర్ టీమ్ కు అభినందనలు.గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కించుకున్న మొట్టమొదటి ఆసియా చిత్రం.

భారతీయ సినిమాకు అద్భుతమైన విజయం!” అంటూ ఈమె పోస్ట్ చేసింది.

ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయ్యింది.ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చాలా ఏళ్ల పాటు రాణించిన విషయం తెలిసిందే.ఇక ఇప్పుడు ప్రియాంక చోప్రా ఇండియాలోనే కాదు గ్లోబల్ వైడ్ గా పాపులర్ అయిన నటి.ఈమె హాలీవుడ్ లో సైతం నటిస్తూ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది.

ఇలా ప్రెజెంట్ ఈమె పాన్ వరల్డ్ వైడ్ గా స్టార్ డమ్ అనుభవిస్తుంది.ఇలాంటి సమయంలో రాజమౌళికి మరింత గుర్తింపు దక్కించు కోవాలంటే.హాలీవుడ్ లో సైతం మన తెలుగు తేజం విస్తరించాలి అన్న ప్రియాంక చోప్రా లాంటి గ్లోబల్ స్టార్ తో కలిసి సినిమా తెరకెక్కిస్తే బాగుంటుంది అని చాలా మంది తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు.

మరి ప్రియాంక చోప్రా వంటి స్టార్ తో రాజమౌళి సినిమా చేస్తాడా లేదా అనే విషయం ముందు ముందు తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube