ఆ సినిమాలో ఎన్టీఆర్ చచ్చిపోతే ఏడ్చేసిన జక్కన్న.. రాజమౌళి సినిమాల్లో హీరో రోల్స్ వెనుక కథ ఇదే!

రాజమౌళి( Rajamouli ).ప్రస్తుతం ఈ పేరు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మారు మోగుతుంది.

 Rajamouli Got Bad Experience In Nt Rama Rao Movie Still Now He Following That Ru-TeluguStop.com

బాహుబలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జక్కన్న ఆర్ఆర్ఆర్ తో ప్రపంచం మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు చూసేలా చేసారు.అంతేకాకుండా ఈ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచారు జక్కన్న.

ఇండియన్స్ డ్రీమ్‌గా ఉన్న ఆస్కార్ ని తెచ్చిపెట్టాడు.ఇప్పుడు అంతర్జాతీయంగా దర్శకుడిగా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే తన సినిమాల్లో మాత్రం ఒక విషయాన్ని రూల్‌గా పాటిస్తాడట.రాజమౌళి దానికి ఎన్టీఆర్‌ సినిమా ఇన్‌స్పైర్‌ చేసిందట.

ఇంతకీ ఆ కథ ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.రాజమౌళి.

జూ ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కిన స్టూడెంట్‌ నెం1.ఈ చిత్రంతో దర్శకుడిగా మారాడు.

Telugu Aggi Pidugu, Manchi Chedu, Nt Rama Rao, Rajamouli, Rama Rao, Rule, Tollyw

ఈ సినిమా ఆ తర్వాత సింహాద్రి, ఛత్రపతి సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ప్రతి ఒక్క సినిమాతో మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నారు.ప్రభాస్‌తో ఛత్రపతి మూవీతో జర్నీ ప్రారంబించారు జక్కన్న.ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ప్రభాస్‌, రాజమౌళి.కాగా రాజమౌళికి యాక్షన్‌ సినిమాలంటే బాగా ఇష్టం.ఇటీవల ప్రేమలు ఈవెంట్‌ లో కూడా తనకు లవ్‌ స్టోరీస్ నచ్చవని తెలిపారు.నాకు చిన్నప్పట్నుంచి యాక్షన్‌ మూవీస్‌ అంటేనే ఇష్టం అని చెప్పుకొచ్చారు రాజమౌళి.

ఈ సందర్బంగా చిన్ననాటి సంఘటన గుర్తు చేసుకున్నారు.తమ ఫ్యామిలీ చాలా పెద్దది, తాము 13 మంది కజిన్స్ అట.అందులో కాంచి, రాజన్న అని ఇద్దరు పెద్దవాళ్లు.వాళ్లకి నెలకు రెండు సినిమాలు, తాము ఏడెనిమిది మంది ఉండేవాళ్లం.

తమకు మాత్రం నెలకు ఒక్క సినిమానే చూసేలా కండీషన్స్ ఉండేది.

Telugu Aggi Pidugu, Manchi Chedu, Nt Rama Rao, Rajamouli, Rama Rao, Rule, Tollyw

మా ఊర్లో రెండు థియేటర్లు ఉండేవీ.అందులో ఒక థియేటర్‌లో ఎన్టీఆర్‌ అగ్గిపిడుగుమరో థియేటర్లో మంచి చెడు అనే సినిమా( Manchi Chedu ) వచ్చింది.రెండు సినిమాల్లోనూ ఎన్టీరామారావు హీరో.

పెద్దవాళ్లు అగ్గిపిడుగు సినిమా చూశారు.అందులో కత్తిఫైట్లు, అవి ఇవి చాలా ఉన్నాయని ఇంట్లో చెప్పడంతో ఎలా అయిన వచ్చే వారం చూడాలి అని రాజమౌళి వాళ్లు వెయిట్‌ చేస్తున్నారట.

అగ్గిపిడుగు సినిమా( Aggi Pidugu )కి వెళ్దామని రెడీ అవ్వగా మంచి చెడు సినిమాకి వెళ్దాం, అందులో అన్నీ ఫైట్లే ఉన్నాయి, అగ్గిపిడుగులో రెండే ఫైట్లు ఉన్నాయని అబద్దం చెప్పి ఆ సినిమాకి తీసుకెల్లినట్లు తెలిపారు రాజమౌళి.ఇక తాను ఫైట్ల కోసం వెయిట్‌ చేస్తున్నాడట రాజమౌళి.

ఇంటర్వెల్ అవుతుంది.ఒక్క ఫైట్‌ కూడా రాలేదు.

జక్కన్న ఏమో ఏడుస్తున్నాడట.ఈ కమ్రంలోనే ఎన్టీఆర్‌ని దొంగలు చుట్టుముట్టారట.

తీరా చూస్తే అది ఫైట్‌ కాదని మళ్లీ ఎండింగ్‌ వరకు ఒక్క ఫైట్‌ కూడా లేదట.దీంతో తాను బాగా ఏడ్చేశానని, ఫైట్లు లేవని అన్నల ముందు గోల చేశాడట రాజమౌళి.

ఇక చివరికి సినిమాల్లో హీరో ఎన్టీఆర్‌ చచ్చిపోతాడట.ట్రాజెడీ ఎండింగ్‌ చూసి మామూలు చిరాకు కాదు, బాగా ఏడ్చేశాడట.

అలాగే ఆ సినిమా ఒక విషయంలో తనని బాగా ప్రభావితం చేసిందని చెప్పాడు రాజమౌళి.ఆ ట్రాజెడీ ఎండింగ్‌ చూసి నా జన్మలో ఇలాంటి ఎండింగ్‌ పెట్టకూడదని నిర్ణయించుకున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube