Rajamouli: ప్రపంచ సినిమా మ్యాపులో తెలుగు స్థానాన్ని మార్చబోతున్న రాజమౌళి

ట్రిపుల్ ఆర్(RRR) సినిమాకు ఆస్కార్ వష్తుందో రాదో కాసేపు ఆ గోల పక్కన పెడితే అయన పెట్టిన ఖర్చు గురించి టాలీవుడ్ లో జరుగుతున్న వివాదాలను చూస్తే ఒక విషయం ఖచ్చితంగా చెప్పక తీరాల్సిందే.నిర్మాత దానయ్య తన సొంత సినిమాకు ఆస్కార్ కి ప్రయత్నిస్తాము అంటే డబ్బు పెట్టడానికి ఒప్పుకోలేదు.

 Rajamouli Global Calculations For Telugu Movie-TeluguStop.com

అయినా కూడా రాజమౌళి అన్ని కోట్ల ఖర్చులు తానే సొంతంగా భరిస్తున్నాడు.ఇక్కడ వరకు మనకు తెలిసిందే.

అయితే ఇన్ని కోట్లు ఊరికే ఖర్చు పెట్టడానికి రాజమౌళికి (Rajamouli) ఏమైనా పిచ్చా చెప్పండి.అతడి లెక్కలు, ప్రణాళికలు వేరు.

ఇప్పుడు మనకు కేవలం 80 కోట్ల రూపాయల ఖర్చు మాత్రమే కనిపిస్తుంది.

Telugu Rajamouli, Ntr, Danayya, Ram Charan, Rrr, Rrr Oscar, Tamma Bharadwaj, Tol

ఒక వ్యక్తి ఆ 80 కోట్లు ఉంటె ఎనిమిది సినిమాలు తీస్తాను అంటున్నాడు.కానీ ఇప్పటి వరకు ఒక సినిమా తీస్తే ఆ సినిమాకు సంబందించిన లెక్కలు తెలియాలంటే నిజాం కి ఎంత వచ్చింది, సీడెడ్ ఎంత అంటూ ఉంటారు.కానీ రాజమౌళి వేస్తున్న ప్రణాళిక ప్రకారం మరో మూడేళ్లు లేదా నాలుగు ఏళ్లలో బ్రెజిల్ ఎంత తేలింది, జపాన్ ఎంత వసూళ్లు చేసింది అని మన సినిమాను దేశాల వారీగా లెక్కలు వేయాలని అనుకుంటున్నాడు.

తాను కేవలం ఒక ఆస్కార్ (Oscar) కోసం ఇంత ఖర్చు పెట్టడం లేదు.తన మార్కెట్ ని పెంచుకుంటూ వెళ్తున్నాడు.ఇది ఆర్ ఆర్ ఆర్ సినిమా కంటే కూడా రాజమౌళి కె బాగా ఉపయోగం.

Telugu Rajamouli, Ntr, Danayya, Ram Charan, Rrr, Rrr Oscar, Tamma Bharadwaj, Tol

రాష్టాల లెక్కలు వేసుకోవడం మాని దేశాల వారీగా ఎంత రాబడుతుంది అనే లెక్కలు వేయాలని, అంత రేంజ్ మార్కెట్ పెంచాలని, అంత గొప్ప సినిమాలు తీయాలని ప్రయత్నిస్తున్నాడు.అంటే ఈ రోజు ఉన్నపళం గా ఎదో అయిపోతుంది అని అనుకోవడం లేదు రాజమౌళి. రానున్న భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకొని తెలుగు సినిమా మార్కెట్ పెంచుతున్నాడు.

ప్రపంచ సినిమా మ్యాపులో ఒక్క చుక్క అంత కూడా లేని తెలుగు సినిమాను అందరికి పరిచయం చేస్తున్నాడు.ఇదంతా అర్ధం చేసుకోకుండా 80 కోట్లు ఖర్చు అంటే ఎలా అవుద్ది.

రానున్న రోజుల్లో 800 కోట్లు అని మాట్లాడుకోవాలి.ఇప్పుడు తానే రాసె కథలు, తీసే సినిమాలు, వచ్చే రెవెన్యూ మొత్తం గ్లోబల్ నాట్ లోకల్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube