రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) మరియు రాజమౌళి( Rajamouil ) ల మధ్య ఉన్న సంబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే.ఇద్దరూ కూడా చాలా కాలంగా మంచి స్నేహితులు.
అలాగే ఇద్దరి కెరీర్ లో ఉన్నతమైన మార్పుకు ఇద్దరూ కారణం అనడంలో సందేహం లేదు.వీరిద్దరి కాంబోలో వచ్చిన చత్రపతి మరియు బాహుబలి సినిమా లు ఓ రేంజ్ లో సత్తా చాటాయి.
ముఖ్యంగా బాహుబలి 2( Baahubali 2 ) సినిమా వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేసిన నేపథ్యం లో వీరిద్దరి కాంబో మళ్లీ ఎప్పుడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇప్పట్లో వీరిద్దరి కాంబో సినిమా ఉండే అవకాశం లేదు.
కానీ వీరిద్దరి కాంబోలో ఒక ఆసక్తికర ఇంటర్వ్యూ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ప్రభాస్ తాజాగా సలార్ సినిమా లో( Salaar Movie ) ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో నటించిన విషయం తెల్సిందే.సినిమా రికార్డ్ స్థాయి వసూళ్లు నమోదు చేయడం కన్ఫర్మ్ అంటూ ఇప్పటికే తేలిపోయింది.ఈ సమయంలో సినిమా ప్రమోషన్ గురించి ఆసక్తికర విషయం ఒకటి చర్చకు వస్తోంది.
సలార్ సినిమా ప్రమోషన్( Salaar Promotion ) కోసం ఒక ఇంటర్వ్యూ ఉండబోతుంది.ఆ ఇంటర్వ్యూలో ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్, కీలక పాత్రలో నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్ లను రాజమౌళి ప్రశ్నలు అడుగబోతున్నాడట.

ఈ విషయమై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి.ఒకటి రెండు రోజుల్లోనే ఈ షూట్ ఉంటుందని అంటున్నారు.ప్రశాంత్ నీల్( Prashanth Neel ) అంటే రాజమౌళికి ప్రత్యేకమైన అభిమానం.ఆ విషయం గతంలోనే నిరూపితం అయింది.కేజీఎఫ్ సినిమా కు ఆ రేంజ్ బజ్ క్రియేట్ అవ్వడానికి కారణం కచ్చితంగా రాజమౌళి అంటూ ప్రశాంత్ నీల్ కూడా ఒప్పుకుంటాడు.ఆయన ట్వీట్ వల్లే కేజీఎఫ్ గురించి చర్చ మొదలు అయింది.
ఇప్పుడు సలార్ కోసం కూడా రాజమౌళి రాబోతున్నాడు అంటున్నారు.ఒక వేళ ఇంటర్వ్యూ సాధ్యం కాకుంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అయినా రాజమౌళి పాల్గొనే అవకాశాలు లేకపోలేదు.