టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా కోసం అభిమానులు గత కొద్ది రోజులుగా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు.
అయితే అందరూ అనుకున్న విధంగా ఆ సమయం రానే వచ్చింది.నేడు ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా విడుదల అయ్యింది.
ప్రభాస్ సినిమా విడుదల అవుతుండటంతో అభిమానులు థియేటర్ల వద్ద భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు.ఇదిలా ఉంటే సినిమా విడుదల సందర్భంగా ఆ ప్రభాస్ ను రాజమౌళి ఇంటర్వ్యూ చేశారు.
ఈ క్రమంలోనే పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ.
బాహుబలి సినిమా తర్వాత యాక్షన్ తో కూడిన లవ్ సినిమా చేయాలని అనుకున్నాను.కానీ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ పూర్తి లవ్ స్టోరీ చేసేసారు అని చెప్పుకొచ్చారు ప్రభాస్.
బాహుబలి సినిమా తర్వాత నాతో లవ్ స్టోరీ చేయాలనుకోవడం అంత ఈజీ కాదు, కానీ అలాంటిది నాతో లవ్ స్టోరీ సినిమా చేసినందుకు ఆయనకు ముందుగా థ్యాంక్స్ చెబుతున్నాను అని తెలిపారు ప్రభాస్.ఆ తరువాత ప్రభాస్ రాజమౌళి ని ఒక ప్రశ్న అడిగారు.
నేను హీరోగా నటించిన వర్షం సినిమా ను మీరు చూశారు.అందులో ఒక అబ్బాయి అమ్మాయి వెనుక అదే పనిగా తిరగడం నేను రాయలేను, సినిమా తీయలేను,చూడలేను అని అన్నారు.

అంతే కాకుండా అలాంటి కాన్సెప్ట్ ల గురించి నేను ఆలోచించను అని కూడా అన్నారు.కానీ 500 ఏళ్ల తర్వాత కూడా ఒక అమ్మాయి వెంట అబ్బాయి పడినట్టుగా మగధీర సినిమా తీశారు.వర్షం సినిమాలో అబ్బాయి అమ్మాయి వెనక తిరగడం కొంతసేపు మాత్రమే ఉంటుంది.కానీ ఐదు సంవత్సరాల తర్వాత కూడా అమ్మాయి వెంట పడటం చూపించారు.ఈ నాలుగేళ్ల లో ఇంత మార్పు ఎలా వచ్చింది అని ప్రభాస్ ప్రశ్నించగా.ఆ విషయంపై రాజమౌళి స్పందిస్తూ.
నువ్వే చెడగొట్టాడు నన్ను అంటూ రాజమౌళి కూల్ గా సమాధానం చెప్పడంతో ప్రభాస్ ఒక్కసారిగా నవ్వేశాడు.అనంతరం రాధేశ్యామ్ సినిమా గురించి మాట్లాడుతూ అందులో సంచారి అనే సాంగ్ బాగుంది, ఆ పాటలో ఒక చోట మీ నవ్వు నాకు బాగా నచ్చింది అనేది రాజమౌళి చెప్పగా అప్పుడు ప్రభాస్ నవ్వుతూ మీకు నచ్చింది అంటే అందరికీ నచ్చుతుందనే నమ్మకం నాకు ఉంది అని తెలిపాడు.