మన దేశం గర్వించ దగ్గ దర్శకుడు రాజమౌళి( Rajamouli ) అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు, ఇది వరకు ఆయన ఎంతో మంది టాలెంటెడ్ హీరోలతో సినిమాలు చేసి ఉండొచ్చు.కానీ ఆయన అమితంగా ఇష్టపడేది జూనియర్ ఎన్టీఆర్( Jr ntr ) ని మాత్రమే.
ఈ విషయం ఆయన అనేక సందర్భాలలో చెప్పుకొచ్చాడు, ఎన్టీఆర్ కి కూడా రాజమౌళి అంటే ప్రాణం.ఈరోజు ఆయన ఈ స్థాయిలో ఉండడానికి కారణం రాజమౌళి.
ఎన్టీఆర్ కెరీర్ లో భారీ హిట్స్ గా చెప్పుకునే 5 సినిమాలలో నాలుగు సినిమాలు రాజమౌళి తెరకెక్కించినవే.కెరీర్ ని ఒకేసారి ప్రారంభించడం, ఎక్కువ రోజులు కలిసి ట్రావెల్ చెయ్యడం కారణం గా, వీళ్ళ మధ్య అన్నదమ్ముల రేంజ్ సంబంధం ఉంటుంది.
అందుకే రాజమౌళి ఎన్టీఆర్ తో ఎప్పుడు సినిమా చేసిన ప్రపంచం మొత్తం మాట్లాడుకునే రేంజ్ సినిమానే చేసాడు.గత ఏడాది రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం తో పాన్ ఇండియా కూడా దాటి పాన్ వరల్డ్ స్థాయికి వెళ్లి, పాన్ వరల్డ్ స్టార్ అనిపించుకున్నాడు.

అయితే అది మల్టీస్టార్ర్ర్ సినిమా, ఎన్టీఆర్ పాత్ర ఇందులో రామ్ చరణ్( Ram Charan ) తో పోలిస్తే చాలా తగ్గిందని, సపోర్టింగ్ రోల్ లాగ అనిపించిందని చాలా మంది అభిమానులు ఫీల్ అయ్యారు.అప్పటి నుండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మా హీరో తో ఒక పూర్తి స్థాయి సినిమా తియ్యాలని రాజమౌళి ని డిమాండ్ చేస్తూ ఉన్నారు.వాస్తవానికి రాజమౌళి ఎప్పటి నుండో ఎన్టీఆర్ తో ‘గరుడ’ అనే చిత్రాన్ని తియ్యడానికి ప్లన్స్ చేసుకున్నాడు.అప్పటి బడ్జెట్ కి ఈ సినిమా సరిపోక ఈ చిత్రాన్ని చేయలేకపోయారు.
ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ మార్కెట్ వెయ్యి కోట్ల రూపాయిల రేంజ్ కి వెళ్ళింది.మామూలుగా ఆడిన వెయ్యి కోట్ల రూపాయిలు వచ్చేస్తున్నాయి.ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రెండు వేల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టి ఆల్ టైం టాప్ 1 స్థానం లో ఉన్నది మన బాహుబలి సినిమానే.కాబట్టి ఇప్పుడు మన తెలుగు సినిమాకి ఎంత బడ్జెట్ అయినా పెట్టొచ్చు, లిమిట్ లేదు.

అందుకే ఎన్టీఆర్ ని హీరో గా పెట్టి 5000 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో ‘గరుడ( Garuda )’ చిత్రాన్ని చెయ్యడానికి రాజమౌళి సన్నాహాలు చేస్తున్నాడట.ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు తో చెయ్యబొయ్యే సినిమాకి స్క్రిప్ట్ పనుల్లో బిజీ గా ఉన్నాడు.ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉంది, ఈ చిత్రం పూర్తి అయినా వెంటనే ఎన్టీఆర్ తో ఈ క్రేజీ ప్రాజెక్ట్ చెయ్యడానికి సిద్ధం అవుతున్నదని తెలుస్తుంది.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వచ్చే ఏడాది బయటకి వచ్చే అవకాశం ఉందట.
ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ తో దేవర అనే చిత్రం చేస్తున్నాడు.ఈ సినిమా పూర్తి అవ్వగానే ఆయన ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా , అలాగే హ్రితిక్ రోషన్ తో కలిసి ‘వార్ 2 ‘ అనే చిత్రం లో నటించబోతున్నాడు.
ఈ రెండు సినిమాల తర్వాత ‘గరుడ’ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
