టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో మహేష్ బాబు హీరో గా ఒక సినిమా రూపొందాల్సి ఉంది.రెండు సంవత్సరాలుగా ఆ సినిమా కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.
ఇప్పటి వరకు కనీసం స్టోరీ లైన్ రెడీ అయిందా… స్క్రిప్ట్ వర్క్ మొదలు అయిందా అనేది క్లారిటీ ఇవ్వడం లేదు.సోషల్ మీడియా లో ఈ సినిమా గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు మాట్లాడేసుకుంటున్నారు.
కానీ రాజమౌళి( Rajamouli ) మాత్రం మహేష్ బాబు తో సినిమా ఇలా చేయబోతున్నాను… అలా ఉండబోతుంది అంటూ నోరు తెరిచి మాట్లాడటం లేదు.ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్( Vijayendra Prasad ) మాత్రం అదుగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఆయన మాటలను నమ్మే పరిస్థితి లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి మహేష్ బాబు తో( Mahesh Babu ) రాజమౌళి సినిమా ను 2023 లో ప్రారంభించడం కాదు కదా కనీసం స్క్రిప్ట్ వర్క్ అయినా మొదలు అయిందో తెలియడం లేదు.కనుక ఇప్పుడు మహేష్ బాబు అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేమికులు మరియు పాన్ ఇండియా రాజమౌళి అభిమానులు కనీసం ఈ సినిమా ను 2024 లో అయినా ప్రారంభిస్తారా అంటూ ఆయన్ను ప్రశ్నిస్తున్నారు.
రాజమౌళి దర్శకత్వం లో సినిమా అంటే ప్రతి హీరో కూడా కనీసం రెండేళ్ల డేట్ల ను ఇవ్వాల్సి ఉంటుంది.కానీ మహేష్ బాబు ముందే ఏడాది లో ముగించాలని సూచించాడట.కనుక రాజమౌళి ఎలా తీస్తాడో.
అసలు ఎప్పుడు మొదలు పెడుతాడో అర్థం కావడం లేదు.కొంపతీసి చివరి నిమిషం లో సినిమా ను క్యాన్సిల్ చేసి రాజమౌళి మరో హీరో తో సినిమా ను మొదలు పెట్టడు కదా అన్నట్లుగా కొందరు గుసగుసలాడుకుంటున్నారు.
మరి రాజమౌళి గారి యొక్క మనసు లో ఏముందో ఆయన నోరు విప్పితేనే కదా క్లారిటీ వచ్చేది.