టీడీపీ చంద్రబాబుపై రాజమండ్రి ఎంపీ భరత్ ఫైర్

అవ్వాతాతలంటే ఎటువంటి గౌరవం, జాలి, దయా లేకుండా వ్యవహరిస్తున్న నరరూప రాక్షసుడు చంద్రబాబు నాయుడని రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ రామ్ ధ్వజమెత్తారు.అవ్వాతాతలకు పెన్షన్ అందకుండా చేసిన చంద్రబాబు కడుపు మంట చల్లారిందా అని ప్రశ్నించారు.

 Rajahmundry Mp Bharat Fires On Tdp Chandrababu,tdp Chandrababu,rajahmundry Mp Bh-TeluguStop.com

సోమవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు( TDP Chandrababu Naidu )పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.జగనన్న ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థపై మొదటి నుంచీ చంద్రబాబుకు కడుపు మంటే అన్నారు.ప్రతీ నెలా ఫస్ట్ తారీఖున అవ్వాతాతలకు, దివ్యాంగులకు, దీర్ఘకాల రోగులకు తలుపుకొట్టి ఆప్యాయంగా పలకరిస్తూ నెలకు రూ.3 వేలు పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు చూడలేకపోయారన్నారు.నిస్వార్థంగా ప్రజా సేవ చేస్తున్న వాలంటీర్లపై ఎందుకనో చంద్రబాబుకు గిట్టేది కాదన్నారు.అభం శుభం తెలియని అమాయక వాలంటీర్లపై చంద్రబాబు, మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ( Nimmagadda Prasad ) కలిసి కుట్ర పన్నారన్నారు.

ఫిర్యాదులపై ఫిర్యాదులు చేసి వాలంటీర్ల విధులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించేలా చేశారన్నారు.దీనివల్ల తీవ్రంగా నష్టపోయేది, ఇబ్బందులు పడేది పెన్షన్దార్లేనని అన్నారు.గత 2014లో ఎన్డీఏతో( NDA ) అంటకాగిన టీడీపీ చంద్రబాబు రాష్ట్రానికి చేసిన ప్రయోజనం ఏమీ లేదన్నారు.2019 ఎన్నికలకు సంవత్సరం ముందు ధర్మపోరాట దీక్షలు చేసి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి.ఇప్పుడు మళ్ళీ కలవడానికి కారణాలేమిటో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

ఎన్డీఏలో ఉన్నప్పుడు కనీసం ఒక్కసారి కూడా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ప్రస్తావన చంద్రబాబు ప్రధాన మంత్రి వద్దకు తీసుకు రాలేదన్నారు.

రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక విభజన హామీలు, ప్రత్యేక హోదా తదితర వాటిపై ప్రధాని ఏమైనా హామీ ఏమైనా ఇవ్వడం వల్ల తాజాగా మళ్ళా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారా అని చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు.విశాఖపట్నం బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి( CM YS Jagan ) ప్రధాని మోదీని ప్రత్యేక హోదా గురించి సూటిగా ప్రశ్నించారని ఎంపీ భరత్( MP Bharat ) గుర్తు చేశారు.

రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు చెప్పడం ఈ రాష్ట్ర ప్రజలందరి చెవుల్లో పెద్ద పెద్ద కాబేజీ పువ్వులు పెట్టడమే అన్నారు.చంద్రబాబు పాలన వల్లే ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) అన్ని విధాలా సర్వ నాశనం అయిందన్నారు.

ఒక రాజధాని లేదు, పోలవరం ప్రాజెక్టు లేదు, ఒక పరిశ్రమ లేదు, యువతకు ఉపాధి అవకాశాలు చూపించలేదని ధ్వజమెత్తారు‌.తెలంగాణాలో మకాం, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వ్యాపారం చేసే వలస పక్షులు మనకి అవసరం లేదన్నారు.వీక్లీ హాఫ్, మంత్లీ హాఫ్ నాయకుల మాటలు నమ్మి మోసపోతే ఈ రాష్ట్రాన్ని కాపాడేవాడు ఉండడని అన్నారు.2014లో చంద్రబాబు సాధించిందేమీ లేదని, 2024లో కూడా ఏమీ లేదన్నారు.ఇటువంటి వారినే సీజనల్ లీడర్స్, పొలిటికల్ దొంగలని అంటారని ఎంపీ భరత్ అభివర్ణించారు.‌

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube