చిత్రం : రాజా ది గ్రేట్బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్దర్శకత్వం : అనిల్ రావిపూడినిర్మాత : దిల్ రాజుసంగీతం : సాయి కార్తిక్విడుదల తేది : అక్టోబర్ 18, 2017నటీనటులు : రవితేజ, మెహ్రీన్, రాధిక, ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ తదితరులు
కథలోకి వెళితే :
రాజా (రవితేజ) పేరుకే అంధుడు.పోలీసు కావాలన్న లక్ష్యంతో అన్నిరకాలుగా ట్రేయిన్ అయి ఉంటాడు.
సమర్థుడు, అలాగే బలవంతుడు.మరోవైపు ఓ సిన్సియర్ పోలీసు ఆఫీసర్ (ప్రకాష్ రాజ్) కూతురు లక్కి (మెహ్రీన్) ని చంపేందుకు యత్నిస్తుంది విలన్ గ్యాంగ్.
దాంతో లక్కి డార్జిలింగ్ పారిపోతుంది.రాజా లక్కికి ఎలా తారసపడ్డాడు, ఎందుకు తారసపడ్టాడు.లక్కిని ఆపదలోంచి కాపాడగలిగాడా లేదా అనేది థియేటర్లో చూడండి.
నటీనటుల నటన :
చాలారోజుల తరువాత రవితేజ ఒకప్పటి రవితేజలా స్క్రీన్ మీద కనిపించారు.గడ్డం పూర్తిగా పెంచడం వలనో, ఆమధ్య ఏదో ట్రీట్మెంట్ చేయించుకోవడం వలనో కాని, రవితేజ లుక్ ఫ్రెష్ గా ఉంది.పోషించింది అంధుడి పాత్రే అయినా, ఇందులో రవితేజ నుంచి అన్ని అంశాలుంటాయి.
ఇటు ఫైట్స్ లో, అటు కామెడిలో తన టపికల్ మాస్ అటీట్యూడ్ చూపించాడు రవితేజ.మెహ్రీన్ కి కథలో మంచి ఇంపార్టెన్స్ దొరికింది.బాగా సద్వినియోగం చేసుకుంది అని చెప్పలేం కాని, బాగానే చేసింది.వివన్ భటేనా విలనీజం ఫర్వాలేదు.
గుడ్డి కన్నా మెల్ల నయం అన్నట్లు, బాంబే నుంచి వస్తున్న విలన్స్ లో ఈయన కొద్దిగా బెటర్.రాజేంద్రప్రసాద్ షరామామూలే.
రాజా తల్లి పాత్రలో రాధిక మెప్పించారు.మాస్ కి ఆమె పాత్ర నచ్చుతుంది.
ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ తమ పాత్రపరిధి మేరలో నటించారు.హరితేజ గున్నగున్న మామిడి ఓ హైలెట్.
టెక్నికల్ టీమ్ :
సినిమాటోగ్రఫీ బాగుంది.రవితేజను, మెహ్రీన్ ను, ఇద్దరిని అందంగా చూపించారు.
డార్జిలింగ్ లోకేషన్స్ ని బాగా షూట్ చేసారు.సాయికార్తిక్ పాటలు ఏమంత గొప్పగా లేవు.
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బెటర్.సెకండాఫ్ లో ఎడిటింగ్ గాడి తప్పుతుంది.
కొన్ని సన్నివేశాలు అనవసరం అనిపిస్తాయి.ఫైట్స్ లాజిక్ కి అందకుండా ఉన్నా, హీరో గుడ్డివాడు అన్న సంగతి మాస్ ప్రేక్షకులకి ఎందుకు.ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్ రిచ్.
విశ్లేషణ :
దాదాపుగా రెండెళ్ళు గ్యాప్ తీసుకున్నాడు మాస్ మహరాజ్ రవితేజ.లుక్ మార్చాడు.ప్రేక్షకులు తన నుంచి ఏం ఆశిస్తారో ఇంకా బాగా అర్థం చేసుకున్నాడు.అదృష్టం ఏమిటంటే, ఈ కథ ఇటు రామ్ దగ్గరికి వెళ్ళి, ఆ తరువాత ఎన్టీఆర్ దగ్గరిక వెళ్ళి, ఇద్దరు కాదంటే రవితేజ దగ్గరికి వచ్చింది.కథ ఏమంత గొప్పది కాదు.
చాలా రొటిన్ స్క్రిప్ట్.కాని రవితేజ స్టయిల్లో చూపించేసరికి వినోదం సరిగ్గా పండింది.
కథలో కొత్తదనం లేదు, క్యారక్టర్ లాజిక్ లేదు, సెకండాఫ్ లో వేగం లేదు.అయినా సినిమా బోర్ కొట్టదు.కథ, కథనాలు పక్కనపెట్టి రవితేజ మార్కు వినోదం కావాలనుకుంటే రాజా ది గ్రెట్ మిమ్మల్ని నిరుత్సాహపరచదు.
ప్లస్ పాయింట్లు :
* రవితేజ* కామెడి* గున్న గున్న మామిడి ఎపిసోడ్* మాస్ ఎలిమెంట్స్
మైనస్ పాయింట్స్ :
* రొటీన్ కథ* పేరుకే అంధుడి పాత్రలా ఉండటం* సెకండాఫ్ లో ఎడిటింగ్
చివరగా :
రాజా ఇజ్ నాట్ బ్యాడ్