ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన రాజా రవీంద్ర క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారనే సంగతి తెలిసిందే.అసలు నేను సినిమా ఇండస్ట్రీకి హీరో అవుదామని రాలేదని రాజా రవీంద్ర అన్నారు.
నేను హీరోగా ఒక సినిమా కూడా సక్సెస్ సాధించలేదని ఆయన తెలిపారు.హీరో అంటే చాలా టెన్షన్ ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.
సినిమా ఫ్లాపైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పై పెద్దగా ప్రభావం పడదని ఆయన పేర్కొన్నారు.
సినిమా రిలీజ్ అంటే హీరోలకు విపరీతమైన టెన్షన్ ఉంటుందని రాజా రవీంద్ర అన్నారు.
కొడుకులు ప్రశాంతంగా బ్రతకాలని శోభన్ బాబు కొడుకులను హీరోలను చేయలేదని రాజా రవీంద్ర చెప్పుకొచ్చారు.నేను కూడా ఆర్టిస్ట్ నని హీరోయిన్ల డేట్లు చూస్తే చిన్నచిన్న సమస్యలు ఉంటాయని ఆయన తెలిపారు.
ఎక్కువ సంఖ్యలో సినిమాలలో హీరోయిన్లు నటిస్తూ ఉంటారని అందువల్ల ఇబ్బందులు ఎదురవుతాయని రాజా రవీంద్ర అన్నారు.

అమితాబ్ బచ్చన్ గారితో సూర్యవంశ్ నరసింహ, అన్నయ్య సినిమాలలో తాను ఒకే సమయంలో నటించానని ఈ మూడు సినిమాలలో సౌందర్య హీరోయిన్ అని రాజా రవీంద్ర కామెంట్లు చేశారు.ఆ సమయంలో సౌందర్య గారు పడిన టెన్షన్ చూశానని ఆయన తెలిపారు.సౌందర్య గారు ఫ్లైట్ మిస్ కావడం వల్ల షూట్ కు రాకపోవడంతో నరసింహ సినిమాకు సంబంధించి ఒకరోజు షూట్ జరగలేదని రాజా రవీంద్ర అన్నారు.

ఆ ఘటనతో హీరోయిన్ల డేట్లు చూడకూడదని ఫిక్స్ అయ్యానని ఆయన చెప్పుకొచ్చారు.నేను కేవలం జయసుధ గారి డేట్లు మాత్రమే చూస్తున్నానని ఆయన తెలిపారు.రాజ్ తరుణ్ ఇష్యూ సమయంలో బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తిపై కేసు పెట్టానని ఆయన చెప్పుకొచ్చారు.రాజ్ తరుణ్ దగ్గర డబ్బులు కొట్టేద్దామని అతను ప్లాన్ చేశాడని రాజా రవీంద్ర అన్నారు.







