సన్ రైజ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై( Sunrise Entertainments ) నిర్మాత స్వాతి రాజు నిర్మిస్తున్న సినిమా మాస్ మహారాజు.( Mass Maharaju ) రాజ్ తరుణ్,( Raj Tarun ) సందీప్ మాధవ్( Sandeep Madhav ) హీరోలుగా నటిస్తున్న మాస్ మహారాజు సినిమాకు సి.
హెచ్.సుధీర్ రాజు( CH Sudhir Raju ) దర్శకత్వం వహిస్తున్నారు.
మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి షెడ్యుల్ జరుపుకుంటుంది.గదర్ 2 హీరోయిన్ సిమ్రత్ కౌర్,( Simrat Kaur ) బిచ్చగాడు ఫేమ్ సట్న టీటస్,( Satna Titus ) సంపద( Sampada ) హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాజా రవీంద్ర, రవి శంకర్, షఫీ, శివరామరాజు వెంకట్, సత్యం రాజేష్, ధనరాజ్, రచ్చ రవి, ఐశ్వర్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ చాలా డిఫరెంట్ లుక్స్ లో ఈ మూవీలో కనిపించబోతున్నారు.1980 బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి.త్వరలో విడుదల తేదీని ప్రకటించబోతున్నారు చిత్ర యూనిట్.







