ఆదిపురుష్( Adipurush ) సినిమా చాలామంది ప్రేక్షకుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ గురించి, కొన్ని సీన్ల గురించి తీవ్రస్థాయిలో నెగిటివ్ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఎన్ని మార్పులు చేర్పులు చేసినా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించే అవకాశం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ సినిమాలో కొన్ని పాత్రలను క్రియేట్ చేసిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాజ్ షేఖావత్ కర్ని సేన దర్శకుడు ఓం రౌత్( Om Rauth ) ను, ఈ సినిమా కోసం పని చేసిన డైలాగ్ రైటర్ ను చంపేస్తాం అని వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.క్షత్రియ కర్ని సేన జారీ చేసిన ఈ హెచ్చరికలు సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాయి.
ఈ సినిమాలో పాత్రలను మలచిన తీరు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలోని డైలాగ్స్ సైతం భక్తుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయి.
పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ సినిమా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోలేదని తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ప్రభాస్ ఫ్యాన్స్ లో కూడా కొంతమందికి ఈ సినిమా ఏ మాత్రం నచ్చలేదు.ఓం రౌత్ ప్రభాస్ లాంటి స్టార్ ఛాన్స్ ఇచ్చినా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
క్షత్రియ కర్ని( Kshatriya Karni ) జాతీయ అధ్యక్షుడు రాజ్ షేకావత్ మాట్లాడుతూ మా సేనకు చెందిన వాళ్లు డైరెక్టర్ ఓం రౌత్, డైలాగ్ రైటర్ మనోజ్ కోసం ఎదురుచూస్తున్నామని చెప్పుకొచ్చారు.వాళ్లు బయట కనిపించిన మరు క్షణం చనిపోతారని ఆయన కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.ఈ కామెంట్ల గురించి ఓం రౌత్ లేదా చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సి ఉంది.