ఒక్క కారు మీదనే పడుతున్న వర్షం... వీడియో చూస్తే అవాక్కవుతారు..!

సాధారణంగా వర్షం అనేది ఒక ప్రాంతమంతా కురుస్తుంది.కనీసం కిలోమీటర్ల పొడవునా వర్షం అనేది విస్తరిస్తుంది.

 Raining On Only 1 Car Video Viral On Social Media Details, Car , Rain, Viral Lat-TeluguStop.com

కానీ ఒకే వ్యక్తిపై లేదా ఒకే వస్తువుపై వర్షం పైనుంచి కురవడం అనేది ఎప్పుడూ జరగదు.అలా మనం అనుకుంటాం కానీ అది అబద్ధం అని తాజాగా ఒక ఘటన చెప్పకనే చెబుతోంది.

ఈ సంఘటనలో ఒకే కారుపై వర్షం అనేది పడింది.అంటే కొన్ని అడుగుల స్థలంలో మాత్రమే వర్షం పడింది.

దాని పక్కన ఎక్కడ కూడా ఒక్క చుక్క కూడా పడలేదు.కేవలం కారు టాప్‌పైనే వర్షం కురిసింది.

ఒకే చిన్న మేఘం ఈ వర్షాన్ని కురిపించిందేమో అనేలా ఉంది ఈ దృశ్యం.అందుకే ఇలా ఒకే ఒక కారుపై వర్షం అనేది పడింది.ఆకాశం పైకి చూస్తే ఎవరో పైనుంచి బకెట్లతో నీరుపోసినట్టుగా అనిపించింది.కానీ ఇది నిజంగా ఆకాశం పై నుంచి పడిన వర్షమే! ఈ దృశ్యాన్ని తీస్తున్న వ్యక్తి తన ఫోన్ కెమెరాను పైకి పెట్టి ఉంచగా నీళ్ల అనేవి ఆకాశం నుంచి కురుస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ఈ వీడియో ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా ఇప్పుడు వైరల్ గా మారింది.

వైరల్ అవుతున్న వీడియో క్లిప్‌లో, ఒక పార్కింగ్ స్థలంలో ఆపి ఉంచిన ఒక కారుపై వర్షం కురవడం చూడవచ్చు.

దీని చూసి ఒక వ్యక్తి ఆశ్చర్యపోయారు.అనంతరం ఈ అద్భుతమైన దృశ్యాన్ని తన కెమెరాలో బంధించారు.అయితే, ఈ ప్రకృతి అద్భుతం ఎక్కడ చోటుచేసుకుందో తెలియరాలేదు.ఈ వీడియో వర్షం ఒక షవర్ లాగా ఒక ఎస్‌యూవీ మీద మాత్రమే పడినట్లు కనిపించింది.ఈ తెల్లటి వాహనం పక్కన ఏడు కార్లు పార్క్ చేశారు.వాటి మీద వర్షం పడలేదు.

ఈ వీడియోను డ్యామ్ దట్స్ ఇంట్రెస్టింగ్ అనే ట్విట్టర్‌ హ్యాండిల్ షేర్ చేసింది.వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికే 42 వేల లైక్‌లు, 16 లక్షల వ్యూస్ వచ్చాయి.

ఈ వండర్ ఫుల్ వీడియో మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube