రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు.స్థిరంగా అల్పపీడనం.
ఉత్తర దక్షిణ ఒడిస్సా తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది.అల్పపీడనం మీదుగా ఏర్పడిన ఆగ్నేయ బంగాళాఖాతం వరకు కొనసాగుతుంది.
వీటి ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజుల పాటు కోస్తా రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు.సోమవారం విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి.
ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచి వర్షాలు కురుస్తున్నాయి.సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఆదివారం ఏర్పడిన అల్పపీడనం దక్షిణ ఛత్తీస్ గఢ్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది దీనికి సంబంధం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపు గాలి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు.రుతుపవన ద్రోణి దక్షిణ ఛత్తీస్ గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం విశాఖపట్నం మీదుగా ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్నట్లు వివరించారు.