ఇండియన్ రైల్వే ఆధ్వర్యంలోని రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), రైల్వే ప్రొటక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్పీఎస్‌ఎఫ్) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి.పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండి నిర్ణీత వయసులో ఉన్న స్త్రీ, పురుషులెవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.జనవరి 1 నుంచి 30 వరకు అభ్యర్థులు నిర్ణీత ఫీజు చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
రాతపరీక్ష, దేహదారుఢ్య పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

* రైల్వే కానిస్టేబుల్ (యాన్సిల్లరీ): 798 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు.విభాగం పోస్టుల సంఖ్య వాటర్ క్యారియర్ – 452 సఫాయ్‌వాలా – 199 వాషర్ మ్యాన్ – 49 బార్బర్ – 49 మాలీ (గార్డెనర్) – 07 టైలర్ (గ్రేడ్ 3) – 20 కాబ్లర్ (గ్రేడ్ 3) – 22 మొత్తం పోస్టులు – 798
అర్హత: పదోతరగతి/ మెట్రిక్యులేషన్/ ఎస్ఎస్ఎల్‌సీ ఉత్తీర్ణత.నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయోపరిమితి: 01.01.2019 నాటికి 18 – 25 సంవత్సరాల మధ్య ఉండాలి.రైల్వేశాఖ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు:
రూ.500.ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళలు, మైనార్టీలు, ఈబీసీ అభ్యర్థులు మాత్రం రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.
పేస్కేలు: వాటర్ క్యారియర్, సఫాయ్‌వాలా, వాషర్ మ్యాన్, బార్బర్, మాలీ (గార్డెనర్) పోస్టులకు రూ.21,700 ప్రారంభ వేతనంగా.టైలర్, కాబ్లర్ పోస్టులకు రూ.19,900 ప్రారంభ వేతనంగా ఇస్తారు.ఇతర భత్యాలు కూడా అందుతాయి.
రాతపరీక్ష విధానం:
✼ ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి.వీటిలో జనరల్ అవేర్‌నెస్ నుంచి 20 ప్రశ్నలు, అరిథ్‌మెటిక్ నుంచి 20 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజినింగ్ నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు.
✼ ప్రతి ప్రశ్నలకు ఒకమార్కు.పరీక్ష సమయం 45 నిమిషాలు.✼ నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయి.ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు (0.33) మార్కులు కోత విధిస్తారు.
✼ మొత్తం 15 భాషల్లో ప్రశ్నపత్రం ఉంటుంది.✼ పరీక్షలో 35 శాతం (ఎస్సీ, ఎస్టీలకు 30 శాతం) మార్కులు సాధిస్తేనే తదుపరి దశకు అర్హత సాధిస్తారు.
ముఖ్యమైన తేదీలు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 01.01.2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 30.01.2019
ఆన్‌లైన్ రాతపరీక్ష ఫిబ్రవరి/ మార్చి 2019..







