రైల్వే శాఖ( Railway department ) కీలక నిర్ణయం తీసుకుంది ట్రైన్ టికెట్ ఎక్సమినర్(టీటీఈ)లకు ప్రత్యేకంగా బాడీ కెమెరాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్టు కింద ముందుగా ముంబై డివిజన్ లో 50 బాడీ కెమెరాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించడానికి రైల్వే శాఖ రెడీ అవుతూ ఉంది.ఇటీవల టీటీఈలపై రైల్వే ప్రయాణికు( TTE )ల అనుచిత ప్రవర్తన ఎక్కువైపోతూ ఉండటంతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రైల్వే ప్రయాణికుల అనుచిత ప్రవర్తన అరికట్టడానికి. టికెట్ చెకింగ్ లో పారదర్శకత కోసం.దీనిని అమలు చేయనున్నారట.టికెట్ చెకింగ్ లో భాగంగా చాలామంది ప్రయాణికులు టీటీఈలపై చేయి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.వాటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియా( Social Media )లో అనేకమైనవి వైరల్ అయ్యాయి.కంపార్ట్మెంట్ లో టీటీఈ ఒక్కడే ఉండటంతో.
హ్యాండిల్ చేయలేని పరిస్థితులు.వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ టీటీఈలకు బాడీ కెమెరాలు అందుబాటులోకి తీసుకువస్తూ ఉందట.







