ఒడిశా రైలు ప్రమాదంపై నష్టపరిహారం ప్రకటించిన రైల్వే శాఖ..!!

ఒడిశా( Odisha ) రాష్ట్రంలో హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురకవటం తెలిసిందే.ఆగి ఉన్న గూడ్స్ ను ఢీ కొనడంతో ఏడు బోగీలు బోల్తా పడటంతో ఈ ఘటనలో 50 మంది మరణించగా 300 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు.

 Railway Department Announced Compensation For Odisha Train Accident  , Coromanda-TeluguStop.com

దీంతో మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ( Department of Railways ) నష్టపరిహారం ప్రకటించింది.మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి రెండు లక్షల రూపాయలు, స్వల్పంగా గాయపడిన వారికి 50 వేల రూపాయలు చొప్పున పరిహారం అందిస్తామని తెలిపింది.

సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.

గాయపడ్డ వారిని సమీపాసుపత్రికి తరలించటం జరిగింది.

ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.ఈ ఘోర రైలు ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్( Ashwini Vaishnaw ) విచారం వ్యక్తం చేశారు.

మృతుల బంధువులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

అలాగే మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.భువనేశ్వర్, కోల్‌కతా నుంచి రెస్క్యూ టీమ్‌లను రప్పించామని, ఎన్డిఆర్ఎఫ్, రాష్ట్ర ప్రభుత్వం బృందాలు, వైమానిక దళం కూడా సమాయత్తమైందని, అవసరమైన ఇతర బలగాల సహాయం కూడా తీసుకుంటామని ట్వీట్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube