దేశంలో ప్రధాన పార్టీలు అయిన బీజేపీ , కాంగ్రెస్ లో ఇప్పుడు సర్వేల బాట పట్టాయి.దక్షిణాదిన బీజేపి కి కాంగ్రెస్ కి ఉన్నంత పట్టు లేదు అయితే కాంగ్రెస్ కూడా బీజేపి అంత వీక్ కాకపోయినా పరవాలేదు అనిపిస్తుంది.
అయితే రాహుల్ గాంధీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో తెలంగాణా మీద ఎక్కువగా శ్రద్ద చూపుతున్నారని టాక్ వినిపిస్తోంది…ఎవరి వ్యూహాలలో వాళ్ళు తలమునకలై పోతున్నారు.తాజాగా సర్వేలు, రిపోర్ట్‌లపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆధారపడుతున్నారని తెలుస్తోంది.
ఇదేరీతిలో తాజాగా తెలంగాణపైనా ఆయన ఓ సర్వే చేయించారట.మరి ఇది ఎంతవరకూ నిజమనేది రానున్న రోజులే చెప్పాలి.
ఏపీ లో కాంగ్రెస్ పార్టీ భవితవ్యంపై సర్వే చేయించుకున్న రాహుల్ తాజాగా తెలంగాణలో కూడా ఎలా ఉంటుందో నని సర్వే చేయించుకున్నట్టుగా తెలుస్తోంది.తెలంగాణలో గెలిచేదెవరనే కోణంలో చేయించిన ఈ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయట…కాంగ్రెస్ పార్టీ మినిమం 64 అసెంబ్లీ సీట్లలో విజయం సాధించి అధికారాన్ని సొంతం చేసుకుంటుందని ఈ సర్వే లో తేలిందట…అయితే టీఆర్ఎస్ మాత్రం కేవలం 42 సీట్లకు పరిమితం అవుతుందని ఈ సర్వే లో తేలిందని అంటున్నారు.
మొత్తం తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే మాత్రం 60 రీచ్ అవ్వాలి.
అయితే ఏకంగా 64 సీట్లు తెచ్చుకుని అధికారం సొంతం చేసుకుంటుందని అంటున్నారు.
అయితే మ్యాజిక్ ఫిగర్ దాటి కేవలం నాలుగు స్థానాలు మాత్రం ఎక్కవగా వస్తున్నాయి.అంటే కేవలం ఈ ఫిగర్ ని టీఆర్ఎస్ పై ఎటువంటి ప్రభావం చుపబోదు.
అంతేకాదు ఈ సర్వేతో అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కూడా ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ అనేది కేవలం టీఆర్ఎస్ పై వ్యతిరేకతని మాత్రమే తెలియచేస్తుందని అంటున్నారు.
అయితే ఇప్పటికే టీఆర్ఎస్ పై కొంత వ్యతిరేకత ఉన్నా సరే ఇటీవల ప్రవేశ పెట్టిన రెండు గొప్ప పథకాలు తమ ఫేట్ మారుస్తాయని గులాబీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌తోపాటు ఎకరాకు 4వేల రూపాయల సబ్సిడీ ఇవ్వడానికి సిద్దపడింది అంతేకాదు ప్రత్యక్షంగా రైతు బ్యాంక్ అకౌంట్లలోనే ఈ నిధులను జమ చేయనుంది.ఇలాంటి పరిస్థితులలో టీఆర్ఎస్ అధికారాన్ని నిలబెట్టుకోకపోవడం అనే ప్రశ్నే లేదంటున్నారు.
అయితే రాహుల్ సర్వేలో టీఆర్ఎస్ కి దక్కేవి కేవలం 42 సీట్లు అయితే మిగిలిన పార్టీల పరిస్థితి ఏమిటంటే.టీడీపీకి 2-5 స్థానాలు వస్తాయని తెలిపిందట…గత ఎన్నికల్లో 15 అసెంబ్లీ సీట్లను ఒక ఎంపీ సీటును గెలుచుకున్న తెలుగుదేశం వచ్చే ఎన్నికల్లో మాత్రం పత్తా లేకుండా పోతుంది అంటున్నారు.
అయితే బిజెపి మాత్రం ఈ సారి కేవలం 3 సీట్లకే పరిమితం అవుతుందని అంటున్నారు.అయితే ఈ సర్వేల విషయంలో ఎంతవరకూ నిజమనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే అంటున్నారు.