ఎన్నికల వేళ అన్ని పార్టీలు తమ రాజకీయ ప్రయాణంలో ఉనికి కోసం, ఓట్లు కోసం ప్రజలని నమ్మించే ప్రయత్నాలు మొదలెట్టాయని చెప్పాలి.ముఖ్యంగా దేశ రాజకీయాలలో ఏపీ ఎప్పుడు కీలకంగా వుంటుంది.
అయితే ఇప్పటికే ఏపీలో కాంగ్రెస్ పార్టీ మీద విభజన కోపం వుంది.దీనిని తగ్గించుకునే ప్రయత్నం కాంగ్రెస్ అధినాయకత్వం చేస్తున్న అది ఎ మాత్రం ఫలితం చూపించడం లేదు.
ఇక ఈ 5 ఏళ్ల కాలంలో కేంద్రంలో వున్న బీజేపీ మీద కూడా ఏపీ ప్రజలకి తీవ్రమైన అసహనం పెరిగిపోయింది.విభజన హామీలు, ప్రత్యెక హోదా అమలు చేయకపోవాడంతో ఆ పార్టీకి సమాధి కట్టే ప్రయత్నంలో ఏపీ ప్రజలు వున్నారు.
అయితే ఏపీ ప్రజల కోపాన్ని తగ్గించి, తమ ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి జాతీయ పార్టీలు రెండు మరల ఎన్నికల రాజకీయాన్ని ఏపీలో షురూ చేసాయి.
ఇప్పటికే ప్రధాని మోడీ ఆ మధ్య గుంటూరులో బహిరంగ సభ ఏర్పాటు చేసి ఏపీ ప్రజలని ఆకర్షించే ప్రయత్నం చేసారు.
అది ఎ మాత్రం వర్క్ అవుట్ కాలేదని బీజేపీ శ్రేణులు గుర్తించాయి.ఇప్పుడు మరల మరోసారి వైజాగ్ లో బహిరంగ సభ ఏర్పాటుకి రంగం సిద్ధం చేస్తున్నారు.
దీనికి ముందస్తు ప్రణాళిక కోసం అమిత్ షా రాజమండ్రిలో కార్యకర్తలతో సమావేశం కానున్నారు.ఇదిలా వుంటే ఇప్పుడు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రేపు తిరుపతిలో పర్యతిస్తున్నాడు.
ఈ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రత్యెక హోదా మీద ఏపీ ప్రజలకి హామీ ఇవ్వడంతో పాటు, ఏపీకి విభజన హామీలని అమలు చేస్తామని వాగ్దానాలు చేయడానికి రెడీ అవుతున్నాడు.దీని కోసం భారీ బహిరంగ సభకి ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే ఇప్పటికే ఏపీలో కాంగ్రెస్ ని సమాధి చేసిన ప్రజలు రాహుల్ మాటలని ఎంత వరకు విశ్వసించి ఆ పార్టీకి ఊపిరి పోస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.