దేశానికి ఊపిరి కావాలి.. ప్రధాని నివాసం కాదు.. కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు..!

ప్రస్తుతం దేశ ప్రజలు అందరు దేవుడు మీద ఆధారపడి బ్రతుకుతున్నారని.కరోనా సెకండ్ వేవ్ ఉదృతి సిటీల్లోనే కాకుండా గ్రామాల్లో కూడా విస్తరించిందని.

ఇలాంటి టైం లో కరోనా నియంత్రణ మీద దృష్టి పెట్టకుండా కేంద్రం ప్రధాని నివాసానికి చెందిన సెంట్రల్ విస్టా పనుల మీద దృష్టి పెట్టడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు.కరోనా వల్ల దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఇప్పుడు దేశానికి ఊపిరి కావాలి కాని ప్రధాని నివాసం కాదని ఆయన అన్నారు.

దేశంలో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి వాటిపై కేంద్రం దృష్టి పెట్టకుండా సెంట్రల్ విస్టా పనులను చూడటంపై మండిపడ్డారు రాహుల్ గాంధీ.ఓ పక్క ఆక్సిజన్ కోసం ఎదురుచూస్తున్న బాధితులతో పాటుగా సెంట్రల్ విస్టా పనులు కొనసాగుతున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో పెట్టారు రాహుల్ గాంధీ.

అంతేకాదు రాజధాని లాక్ డౌన్ టైం లో సెంట్రల్ విస్టా పనులు జరిగేందుకు పర్మిషన్ ఇవ్వడాన్ని కూడా తప్పుబట్టారు రాహుల్ గాంధీ.ప్రజల ఆరోగ్య పరిస్థితిని పక్కన పెట్టి ఈ ప్రాజెక్ట్ ను అత్యవసర సేవల కింద తీసుకు రావడంపై రాహుల్ గాంధీ విమర్శించారు.

Advertisement

వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు