సంగీతం దర్శకులు ఆస్కార్ అవార్డు విజేత ఎ.ఆర్.రెహమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈయన సంగీత సారథ్యంలో ఎన్నో అద్భుతమైన పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ప్రస్తుతం ఈయన పెద్దగా సందడి చేయ లేకపోయినప్పటికీ ఇతనికున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
ప్రస్తుతం హిందీ తమిళ సినిమాలతో బిజీగా ఉన్న ఏ ఆర్ రెహమాన్ తెలుగు డబ్బింగ్ సినిమాలకు సంగీతం అందిస్తున్నప్పటికీ స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు సంగీతం అందించలేదనే చెప్పాలి.
ఇదిలా ఉండగా తాజాగా రెహమాన్ పెద్ద కుమార్తె, సంగీత విద్వాంసురాలు ఖతీజా రెహమాన్ వివాహాన్ని గురువారం ఎంతో ఘనంగా జరిపినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే తన కూతురు పెళ్లికి సంబంధించిన ఫోటోని రెహమాన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు ఈ ఫోటో పై స్పందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇలేకపోతే రెహమాన్ పెద్ద కుమార్తె వివాహం జరగడంతో ఆయన అల్లుడు ఏం చేస్తారనే విషయాల గురించి కూడా ఆరా తీస్తున్నారు.

రెహమాన్ తన కుమార్తె నిశ్చితార్థం జనవరిలో జరిపించి మే 5న ఎంతో ఘనంగా వివాహం చేశారు.ఔత్సాహిక పారిశ్రామికవేత్త, ఆడియో ఇంజనీర్ రియాస్దీన్ షేక్ మొహమ్మద్‌తో తన కుమార్తె వివాహం ఘనంగా జరిపించారు.ఈ క్రమంలోనే రియాస్దీన్ షేక్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా సౌండ్ ఇంజనీరింగ్ అని తెలియజేశారు.
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే రియాస్దీన్ షేక్ 5k ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు.ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.







