ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ చీఫ్‌గా వ్యవహరించిన రఘువీరా రెడ్డి, ఆ తరువాత ఎన్నికల్లో తమ పార్టీ ఓటమి పాలవ్వడంతో నెమ్మదిగా రాజకీయాలకు దూరం అవుతూ వచ్చాడు.ఆ తరువాత ఆయన తన వ్యక్తిగత జీవితంలో నమగ్నమై పోయారు.
వ్యక్తిగత జీవితంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆయన తన సొంత ఊరిలో సరదాగా జీవితం గడుపుతున్నారు.
తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అనంతపురం జిల్లా నీలకంఠపురములోని వ్యవసాయ క్షేత్రంలో ఆయన ఓ బావిలో దూకి సరదాగా ఈత కొడుతూ కనిపించాడు.ఈ క్రమంలో పక్కనే ఉన్న బీసీ హాస్టల్ విద్యార్ధులతో రఘువీరా ఈత కొట్టడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ వయసులో కూడా ఆయన ఈత కొట్టే విధానం చూసి విద్యార్ధులు అవాక్కయ్యినట్లు తెలుస్తోంది.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
మరి రఘువీరా శాశ్వతంగా రాజకీయాలకు దూరం అవుతున్నారా అనే ప్రశ్నకు ఆయన ఏ సమాధానం చెబుతారో చూడాలి.







